Site icon HashtagU Telugu

Covid19: మ‌ర్చి 2020 త‌రువాత తొలిసారిగా కోవిడ్ పెషెంట్ లేని ఆసుప్ర‌తి ఇదే…?

45

45

న్యూఢిల్లీ: మార్చి 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా గురువారం ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాష్ హాస్పిటల్‌లో ఒక్క కరోనా రోగి కూడా లేర‌ని ఢిల్లీ ఆరోగ్య‌శాఖ మంత్రి తెలిపారు. కోవిడ్ -19 రోగులందరూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని, కొత్త రోగి ఎవరూ చేరలేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మూడవ ద‌శ‌లోని కోవిడ్-19 రోగులందరూ విజయవంతంగా ..LNJP హాస్పిటల్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారని ఆయ‌న తెలిపారు.

మార్చి 2020 తర్వాత మొదటిసారిగా, ఈ ఆసుప‌త్రిలో ఒక్క క‌రోనా పెషెంట్ కూడా లేర‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ ఆసుప‌త్రిలో అంకితభావంతో ప‌ని చేసిన మొత్తం వైద్య సోదరులకు వందనాలు సేవ’ అని జైన్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో కోవిడ్-19 యొక్క మొదటి కేసు మార్చి 2020లో నమోదైంది. అప్పటి నుండి LNJP హాస్పిటల్ లో క‌రోనా పెషెంట్ లో చికిత్స పొందుతున్నారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన కీలకమైన ఢిల్లీ ఆసుపత్రుల్లో ఇది ఒక‌టి ఈ ఆసుప‌త్రిలో 2,000 పడకలు ఉన్నాయి. మార్చి ప్రారంభంలో కోవిడ్ -19 యొక్క మొదటి కేసు నమోదైన వెంటనే కరోనా రోగుల‌కు చికిత్స అందించేందుకు మార్చబడిన మొదటి ఆసుపత్రి కూడా ఇదే.