Tragedy: ఈశాన్య ఢిల్లీ నెహ్రూ విహార్‌లో చోటుచేసుకున్న అమానుష ఘటన ఉదయం వెలుగులోకి వచ్చింది. బంధువుల ఇంటికి వెళ్లిన 9 ఏళ్ల చిన్నారి, తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అనంతరం జరిగిన గాలింపు చివరికి ఒక భయానక నిజాన్ని బయటపెట్టింది. బాలిక శవం, ఓ సూట్‌కేసులో పడి ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది.
శనివారం రాత్రి బాలిక సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. అయితే రెండు గంటలు గడిచినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. “ఆమె 200 మీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంటిలోకి వెళ్లింది” అనే సమాచారం తెలుసుకుని బాలిక తండ్రి అక్కడికి వెళ్లారు. ఆ ఇంటి ద్వితీయ అంతస్తులో ఒక ఫ్లాట్ తాళం వేసి ఉండటాన్ని గమనించిన ఆయన, అనుమానంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ సూట్‌కేసులో బాలిక శవంగా కనిపించింది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఆమెను సమీపంలోని నర్సింగ్ హోమ్‌కు తరలించారు. కానీ అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
Akhanda 2 Teaser: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అఖండ 2 తాండవం టీజర్ ఫిక్స్!
ఈ విషయంలో బాలిక తండ్రి చేసిన వర్ణన హృదయాన్ని కలిచివేస్తోంది. “అందరూ అంటున్నారు, మా పాప ఒక ఫ్లాట్‌కి వెళ్లింది. ఆ ఇంటి యజమానిని అడిగితే తాళం తన సోదరుడి దగ్గర ఉందన్నాడు. అమ్మాయి వెళ్లిపోయిందని కూడా చెప్పాడు. కానీ మేము వెళ్తుంటే అతను అక్కడి నుంచి పారిపోయాడు. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా, మా పాప సూట్‌కేసులో కనిపించింది. ఆమె ఒంటిపై దుస్తులు కూడా లేవు” అని కన్నీటి కళ్ళతో వివరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలికపై లైంగిక దాడి జరిగినట్లుగా ప్రాథమికంగా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు ఖచ్చితంగా పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సమాచారం.
ఈ సంఘటన పట్ల దేశవ్యాప్తంగా స్పందన వ్యక్తమవుతోంది. చిన్నారుల భద్రతపై మరింత జాగ్రత్త అవసరమని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన దుర్మార్గులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Telangana Cabinet Expansion: తెలంగాణ కొత్త మంత్రులు వీరే.. నేడే ప్రమాణ స్వీకారం!