Murugadoss Movie: గౌతమ్ కార్తీక్ హీరోగా ఏఆర్ మురుగదాస్ నిర్మించిన ‘ఆగస్ట్ 16, 1947’

ఇప్పటి వరకు ఎవరు చెప్పని షాకింగ్ కథతో ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్ 'ఆగస్ట్ 16, 1947' సినిమాను

Published By: HashtagU Telugu Desk
1947

1947

మన దేశ స్వాతంత్ర్యం గురించి ఇప్పటి వరకు ఎవరు చెప్పని షాకింగ్ కథతో ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్ ‘ఆగస్ట్ 16, 1947’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. గౌతమ్ కార్తీక్ కథానాయకుడిగా పర్పుల్ బుల్ ఎంటర్టైన్మెంట్స్, ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ఏఆర్ మురుగదాస్, ఓం ప్రకాష్ భట్, నర్సీరామ్ చౌదరి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఏప్రిల్ 7న ‘ఆగస్ట్ 16, 1947’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకువస్తున్నట్లు ఈ రోజు నిర్మాతలు వెల్లడించారు.

తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషలలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రేక్షకులను స్వాతంత్రం వచ్చిన సమయానికి ఈ సినిమా తీసుకు వెళ్తుందని, యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నిర్మాతలు చెప్పారు. ఎన్.ఎస్. పొన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్ సరసన రేవతి నటించారు. కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిది. లెజెండరీ కమెడియన్ పుగళ్ కీలక పాత్ర పోషించారు. విడుదల తేదీ వెల్లడించడంతో పాటు సినిమా కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశంలోని ఒక పల్లెటూరిలో జరిగే కథతో రూపొందించిన హిస్టారికల్ సినిమా ‘ఆగస్ట్ 16, 1947’ అని అర్థమవుతుంది. ఈ చిత్రానికి ఆదిత్య జోషి సహ నిర్మాత.

  Last Updated: 09 Mar 2023, 11:19 AM IST