Balakrishna: కారంచేడులో బాల‌య్య సంక్రాంతి సంబ‌రాలు

నంద‌మూరి, నారా కుటుంబం ప్ర‌తి ఏడాది సంక్రాంతి పండుగ‌ను నారావారిప‌ల్లెలో ఘ‌నంగా జ‌రుపుకుంటారు. అయితే ఈ ఏడాది చంద్ర‌బాబు అమ‌రావ‌తిలో ఉండ‌గా.

  • Written By:
  • Updated On - January 14, 2022 / 11:38 AM IST

నంద‌మూరి, నారా కుటుంబం ప్ర‌తి ఏడాది సంక్రాంతి పండుగ‌ను నారావారిప‌ల్లెలో ఘ‌నంగా జ‌రుపుకుంటారు. అయితే ఈ ఏడాది చంద్ర‌బాబు అమ‌రావ‌తిలో ఉండ‌గా.. హిందూపురం ఎమ్మెల్యే, న‌టుడు బాల‌కృష్ణ త‌న సోద‌రి పురంధేశ్వ‌రి ఊరికి వెళ్లారు. కారంచేడులో పురంధేశ్వ‌రి ఇంట్లో బాల‌య్య కుటుంబ స‌మేతంగా సంక్రాంతిని జ‌రుపుకుంటున్నారు. కారంచేడులో భోగి వేడుకలో బాల‌కృష్ణ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలను ఆయ‌న తెలిపారు. సమాజంలో సంపద పెంచే పండుగ సంక్రాంతి అని.. అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాన‌ని బాల‌కృష్ణ తెలిపారు

balakrishna