Spider in Ear: చెవినొప్పితో ఆస్పత్రికి మహిళ.. స్కాన్ చేయగా వెలుగులోకి ఆశ్చర్యకర విషయం

చెవినొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళకు స్కానింగ్ నిర్వహించగా డాక్టర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. స్కానింగ్ లో మహిళ చెవిలో కనిపించిన దానిని చూసి ఖంగుతిన్నారు. చెవిలో ఏకంగా ఓ సాలీడు గూడు కట్టుకున్న సంఘటన చూసి ఆశ్చర్యపోయారు.

Published By: HashtagU Telugu Desk
Ear Spider

Ear Spider

Spider in Ear: చెవినొప్పితో ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళకు స్కానింగ్ నిర్వహించగా డాక్టర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. స్కానింగ్ లో మహిళ చెవిలో కనిపించిన దానిని చూసి ఖంగుతిన్నారు. చెవిలో ఏకంగా ఓ సాలీడు గూడు కట్టుకున్న సంఘటన చూసి ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. అసలు వివరాల్లోకి వెళితే..

ఓ మహిళ గత కొంతకాలంగా చెవినొప్పితో బాధపడుతుంది. భరించలేని చెవినొప్పి గత కొంతకాలంగా ఆమెను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో నొప్పిట్టుకోలేక ఇటీవల చికిత్స కోసం హాస్పిటల్‌కు వెళ్లింది. ఆస్పత్రి వైద్యులో ఆమె చెవిని స్కానింగ్ చేశారు. మహిళ చెవిని ఎండోస్కోపీ చేస్తున్న సమయంలో డాక్టర్లు షాక్ తిన్నారు. చెవిలో ఓ సాలీడు గూడు కట్టుకున్న విషయాన్ని గమనించారు. ముందుగా గూడను చూసి కర్ణబభేరి అని డాక్టర్లు అనుకున్నారు. కానీ నిశితంగా పరిశీలించగా డాక్టర్లకు అసలు విషయం తెలిసింది. అది కర్ణభేరి కాదని సాలీడు గూడు అని గుర్తించారు.

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. హుయిడాండ్ కౌంటీ పీపుల్స్ ఆస్పత్రిలో కెమెరాతో అమర్చిన ప్రత్యేక ట్వీజర్లతో మహిళ చెవిపై ఎండోస్కోపీ నిర్వహించారు. దీంతో ఈ వింత విషయం వెలుగులోకి వచ్చింది. సాలీడు ఒక కుటుంబాన్ని చెవి లోపల ఏర్పరుచుకున్నట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా పరీక్ష సమయంలో ఎండోస్కోపిక్ ట్యూబ్ పై సాలీడు దాడి చేసింది.

చివరికి సాలీడును జాగ్రత్తగా డాక్టర్లు బయటకు తీశారు. దీంతో సదు మహిళ ఊపిరిపీల్చుకుంది. సాలీడు లోపల ఉండటం వల్లే చెవినొప్పిగా ఉండేదని, ఇప్పుడు తీసివేయడంతో మహిళకు నొప్పి తగ్గిందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే సాలీడు విషపూరితమైదని కాకపోవడంతో మహిళకు ఏమీ కాలేదని, చెవి స్వల్పంగా మాత్రమే దెబ్బతింటదని డాక్టర్లు వెల్లడించారు.

  Last Updated: 28 Apr 2023, 10:19 PM IST