Site icon HashtagU Telugu

Top Today News: టుడే టాప్ న్యూస్

Top Today News

Top Today News

Top Today News: చైనాలో కరోనా కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తుంది. కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతుందని ఆ దేశ జాతీయ వ్యాధి నియంత్రణ నివారణ పరిపాలనా శాఖ అధికారులు చెప్పారు. జేఎన్ 1కు సంబంధించి ఇప్పటికే ఏడు కేసులు వెలుగుచూశాయని చైనా వైద్యాధికారులు చెప్పారు.

ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మకు బిగ్ షాకిచ్చింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కు రోహిత్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి హార్దిక్ పాండ్యను సారధిగా నియమించింది. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో ముంబై జ‌ట్టు ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచింది.

మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2014వ సంవత్సరంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దులర్ గోండ్‌కు 25 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు చెప్పింది.

దేశంలో బంగారం ధరలు షాకిస్తున్నాయి.10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై వెయ్యి పెరిగి 57,750కు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై 110 పెరిగి 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ 63,000 కి చేరింది. దీనికితోడు వెండిధరసైతం పెరిగింది. కిలో వెండిపై వెయ్యి పెరిగింది.

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి కొత్త పోకో స్మార్ట్‌ఫోన్ సి65 వచ్చేసింది. పోకో సి65 భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో 10వేల కన్నా తక్కువ ధరకే లభిస్తుంది.

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కొత్త రేషన్ కార్డులు కావాలనుకునేవారి నుంచి త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు.

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించారు. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసు నియామకాల ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు.

ఏపీ ఎన్నికలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి వర్గం భేటీలో ఎన్నికల అంశంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ కాస్త ముందుగానే విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Also Read: former MLA Shakeel : ధాన్యం స్కామ్ లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్..