Pakistani Pilots Captured: గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పాకిస్తాన్‌కు చెందిన మూడు యుద్ధ విమానాలను భారత సేనలు కూల్చేశాయి. వీటిలో ఒక యుద్ధ విమానాన్ని రాజస్థాన్‌లోని జైసల్మీర్ వద్ద, మరో ఫైటర్ జెట్‌ను జమ్మూకశ్మీరులోని అఖ్నూర్ టౌన్ వద్ద భారత ఆర్మీ కూల్చింది. ఈ రెండు యుద్ధ విమానాలను కూల్చగానే.. వాటిలోని పైలట్లు పారచూట్ల సాయంతో భూమిపైకి సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. వారిని వెంటనే అక్కడు భారత భద్రతా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. పాకిస్తాన్ చేపట్టిన ఆర్మీ ఆపరేషన్‌తో ముడిపడిన సమాచారాన్ని రాబట్టేందుకు వారిని ప్రస్తుతం విచారిస్తున్నారు. శుక్రవారం ఉదయంకల్లా ఆ ఇద్దరు పైలట్లను(Pakistani Pilots Captured)అదుపులోకి తీసుకున్న అంశంపై అధికార వర్గాలు అఫీషియల్ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం నాటికి భారత్ – పాక్ సరిహద్దుల్లో యుద్ధ తీవ్రత మరింత పెరుగుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Also Read :Pak PM House: పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుడు.. ఎలా ?
కరాచీ ఓడరేవును ధ్వంసం చేసిన భారత నౌకాదళం
ఎందుకంటే.. గురువారం అర్ధరాత్రి సమయానికి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. అదేమిటంటే.. పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీకి చెందిన ఓడరేవును భారత నౌకాదళం ధ్వంసం చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్ల దాడిలో కరాచీ ఓడరేవు బాగా ధ్వంసమైనట్లు సమాచారం అందుతోంది. ఇది పాకిస్తాన్ ప్రతిష్ఠకు కోలుకోలేని దెబ్బ. కరాచీకి చేరువలోనే ఐఎన్ఎస్ విక్రాంత్ ఉందని అంటున్నారు. అదే నిజమైతే.. పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరే ముప్పు ఉంది. మరోవైపు బెలూచిస్తాన్ రాజధాని నగరం క్వెట్టాను బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) మిలిటెంట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పాకిస్తాన్ భద్రతా బలగాలను తరిమికొట్టారు. భారత వాయుసేన కూడా క్వెట్టా నగరంపై దాడి చేసి పాకిస్తాన్ ఆర్మీ కీలక విభాగాలను ధ్వంసం చేసింది. తద్వారా అక్కడి పాక్ సేనలు డీలాపడ్డాయి. దీన్ని అదునుగా తీసుకున్న బీఎల్ఏ మిలిటెంట్లు క్వెట్టా నగరంపై పట్టును సంపాదించాయి.