Sex Vs Work : సెక్స్‌కు నో అంటే జాబ్ నుంచి తీసేస్తానంటూ ఏళ్ల తరబడి రేప్

Sex Vs Work : అతగాడు రాక్షసుడిలా.. కామ పిశాచిలా ప్రవర్తించాడు.

Published By: HashtagU Telugu Desk
Sex Vs Work

Sex Vs Work

Sex Vs Work : అతగాడు రాక్షసుడిలా.. కామ పిశాచిలా ప్రవర్తించాడు. తనతో సెక్స్ చేయకుంటే డిస్క్ జాకీ (డీజే) జాబ్ నుంచి తీసేస్తానని 31 ఏళ్ల మెక్సికో యువతిని బెదిరించాడు. లొంగదీసుకున్నాడు. ప్రతిసారి ఇలాగే బెదిరిస్తూ 2019 సంవత్సరం నుంచి ఎన్నోసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వేధింపులతో విసిగి వేసారిన మహిళ చివరకు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మ్యూజిక్ ఈవెంట్ కంపెనీ ‘స్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్’ యజమాని, 36 ఏళ్ల ప్రతీక్ పాండేను పోలీసులు అరెస్టు చేశారు. పాండేకు 2020లో వివాహం అయింది. అయితే అంతకుముందు 2017లోనే సోషల్ మీడియా ద్వారా మెక్సికో యువతికి, ప్రతీక్ పాండేకు పరిచయం ఏర్పడింది.

We’re now on WhatsApp. Click to Join.

మోడల్ కావాలనే ఆశయంతో ఆమె 2019లో ముంబైకి చేరుకుంది. ఈక్రమంతో తనను కలవగానే  మెక్సికో యువతికి డీజేగా ప్రతీక్ జాబ్ ఇచ్చాడు. ఇది జరిగిన ఒక నెల వ్యవధిలోనే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తూ.. మెక్సికో యువతిపై పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమెకు అసభ్య ఫొటోలు, మెసేజ్‌లను ఫోన్‌లో ప్రతీక్ పంపేవాడు. ఈవివరాలన్నీ మెక్సికో యువతి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు ప్రతీక్ పాండేపై అత్యాచారం, అసహజ సెక్స్, క్రిమినల్ బెదిరింపు, లైంగిక వేధింపులు,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి సంబంధించిన పలు సెక్షన్ల కింద బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రతీక్ పాండేను డిసెంబర్ 2 వరకు పోలీసు కస్టడీకి కోర్టు(Sex Vs Work) అప్పగించింది.

Also Read: Drinking Water: నీటిని ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. ప్రమాదంలో పడ్డట్టే?

  Last Updated: 02 Dec 2023, 05:51 PM IST