Chetan Bhagat : ప్రముఖ రచయిత చేతన్ భగత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రీ ఇడియట్స్ సినిమాను ఈయన రాసిన త్రీ ఇడియట్స్ నవల ఆధారంగానే చిత్రీకరించారు. ఇవాళ ఉదయం ప్రముఖ మీడియా సంస్థకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కొన్ని రచనలు, పుస్తకాల విషయంలో ఆయనకు నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురవుతుంటాయి. అయితే అందరూ విమర్శించరు. కొంతమందే అలా చేస్తుంటారు. ‘‘మీ రచనలపై ప్రజల నుంచి వచ్చే విమర్శలను ఎలా స్వీకరిస్తారు ?’’ అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. చేతన్ భగత్(Chetan Bhagat) ఆసక్తికర సమాధానమిచ్చారు.
Also Read :Three Encounters : ప్రధాని పర్యటన వేళ మూడు ఎన్‌కౌంటర్లు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
‘‘నేను విమర్శలను, పొగడ్తలను సరిసమానంగా పరిగణిస్తాను. ఆ రెండింటికీ నేను అంతగా ప్రతిస్పందించను. నా పని నేను చేసుకుంటూ ముందుకుపోతానంతే. ఎవరి కోసమూ నా పనిని ఆపను. సూటిగా చెప్పాలంటే నేనొక బొప్పాయి పండు లాంటి వాడిని. అరటిపండులా నేను ఉండదల్చుకోలేదు. అరటిపండును దాదాపుగా అందరూ ఇష్టపడి తింటారు. బొప్పాయి పండును కొంతమందే ఇష్టపడి తింటారు. కొందరు దాన్ని తినేందుకు ఆసక్తి చూపరు. అలాగే నా రచనలను కొందరు ఇష్టపడొచ్చు. కొందరు వ్యతిరేకించొచ్చు. అది వాళ్ల వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం. నేనైతే ఎవరేమనుకున్నా నా రచనలను ఆపేది లేదు’’ అని చేతన్ భగత్ తేల్చి చెప్పారు.
Also Read :Port Blair : ‘పోర్ట్ బ్లెయిర్’కు ఆ పేరు ఎలా వచ్చింది ? బ్లెయిర్ ఎవరో తెలుసా ?
‘‘సమాజంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండి తీరాలి. సినిమాలు, పుస్తకాలు, హాస్యాన్ని బ్యాన్ చేయడం సరికాదు. అలా చేస్తూ పోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది ?’’ అని చేతన్ భగత్ ప్రశ్నించారు. ఫ్యూచర్‌లో మీరు లవ్ జిహాద్ అంశంపై ఏదైనా బుక్ రాయాలని అనుకుంటున్నారా ? అని ఇంటర్వ్యూయర్ ఆయనను ప్రశ్నించగా.. ‘‘నాకు వ్యక్తిగతంగా అనుభవమున్న అంశాలపైనే బుక్స్ రాస్తాను. ఆ టాపిక్‌తో నాకు సంబంధం లేదు. దానిపై అంత అవగాహన లేదు’’ అని బదులిచ్చారు. అయితే అటువంటి టాపిక్స్‌పై తీసే సినిమాల విడుదల విషయంలో సవాళ్లు ఎదురవుతుంటాయనే అంశాన్ని చేతన్ భగత్ గుర్తు చేశారు. తనకు ఇష్టమైన నటుడు షారుక్ ఖాన్ అని ఆయన తెలిపారు. ఒకసారి ముంబైలోని షారుక్ నివాసం మన్నత్‌కు వెళితే తనను బాగా ఆదరించారన్నారు. ‘‘మీకు మోడీ, రాహుల్, కేజ్రీవాల్‌లలో ఎవరు ఇష్టం ?’’ అని ప్రశ్నించగా.. ‘‘ముగ్గురూ సూపర్’’ అని చేతన్ భగత్ బదులిచ్చారు. కోడిగుడ్లతో చేసే కర్రీలు అంటే తనకు ఇష్టమని చెప్పారు.