Vijay Rupani : విమాన ప్రమాదంలో మాజీ సీఎం మృతి..గుజరాత్ ప్రభుత్వం అధికారిక ప్రకటన

ఈ విషాదకర ఘటనపై గుజరాత్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్ మాట్లాడుతూ..అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణించారని తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Former CM Vijay Rupani dies in plane crash.. Gujarat government makes official statement

Former CM Vijay Rupani dies in plane crash.. Gujarat government makes official statement

Vijay Rupani : అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్నే కాదు, గుజరాత్‌ను తీవ్ర విషాదంలో ముంచింది. ఈ ఘోర ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సహా మొత్తం 242 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటనపై గుజరాత్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్ మాట్లాడుతూ..అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణించారని తెలిపారు. లండన్‌కు వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో టేకాఫ్ అయిన ఐదు నిమిషాల తర్వాత కూలిపోయింది. విమాన ప్రమాద ఘటనను విషాదకరమైన సంఘటన గా అభివర్ణించిన పాటిల్, ప్రాణనష్టం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కన్నుమూశారు. బీజేపీ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉంది అని బీజేపీ నాయకుడి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పాటిల్ మెహ్సానాలో విలేకరులతో అన్నారు.

Read Also: Air crash incident : విమాన ప్రమాదంలో మృతులకు రూ.కోటి పరిహారం: టాటా గ్రూప్‌

దేవుడు మరణించిన వారందరి ఆత్మలకు శాంతిని ప్రసాదించాలని, మృతుల కుటుంబాలకు బలాన్ని, శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇక, మృతుల్లో 169 మంది భారతీయులు కాగా, మిగిలిన వారు విదేశీయులే. వీరిలో 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ నుండి వచ్చిన వారు, ఒక కెనడియన్ పౌరుడు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విమానం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా రన్‌వేపై అదుపుతప్పి పేలిపోయినట్లు భావిస్తున్నారు. పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోంది. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు మృతదేహాలను వెలికి తీయడంలో నిమగ్నమయ్యారు. అయితే ప్రమాదంలో శరీరాలు పూర్తిగా కాలిపోయినందున, మృతుల గుర్తింపు డీఎన్ఏ పరీక్షల ద్వారానే సాధ్యమవుతుందని గుజరాత్ ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ధనుంజయ ద్వివేది తెలిపారు.

ప్రయాణికుల బంధువులు తమ డీఎన్ఏ శాంపిళ్లను అధికారులకు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డీఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాకే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తాం. ఇది బాధాకరమైన ప్రక్రియ అయినప్పటికీ, గుర్తింపులో ఖచ్చితత కోసం ఇది అవసరం అని ద్వివేది పేర్కొన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. గుజరాత్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ విమాన ప్రమాదం ఆధునిక భారత విమానయాన చరిత్రలో ఒక పెద్ద విషాద సంఘటనగా నిలిచిపోయింది.

Read Also: Ahmedabad Plane Crash : కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సభ వాయిదా

 

 

  Last Updated: 12 Jun 2025, 08:17 PM IST