గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిన్న (గురువారం) జరిగిన ఘోర విమాన ప్రమాదం (Air india plane crash) నేపథ్యంలో భారత ప్రభుత్వం విమాన భద్రతపై తీవ్రంగా కేంద్రీకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా నిర్వహిస్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాల (Boeing 787-8) కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని వార్తలు బయటకు వచ్చాయి. ఈ విమానాలను విస్తృతంగా సమీక్షించి, సాంకేతికంగా ఎటువంటి లోపాలున్నాయో పరిశీలించేందుకు అమెరికన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
Nails: మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా అనేది గోర్లు చెబుతాయంటా!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం బోయింగ్ విమానాల భద్రతపై అనేక సందేహాలు తలెత్తాయి. విమానాన్ని ఆపరేట్ చేసిన విధానం, నిర్వహణలో అనుమానాలపై స్పష్టత చేయాలని కేంద్రం భావిస్తోంది. బోయింగ్ 787-8 మోడల్ విమానాల పనితీరును అధ్యయనం చేయడంతో పాటు, ముందు జాగ్రత్త చర్యలుగా వాటిని తాత్కాలికంగా రాబోయే రోజుల్లో నిలిపివేసే అవకాశముందని సీనియర్ అధికారవర్గాలు పేర్కొన్నాయి.
Plane Crash : ఎలా బతికానో నాకే అర్థం కాలేదు..విమాన ప్రమాద మృత్యుంజయుడు విశ్వాస్
అంతేకాక విమానాల మెయింటెనెన్స్ విధానాలు, ఆపరేటింగ్ ప్రోటోకాళ్లపై ఎయిర్ ఇండియాను కూడా కేంద్రం విచారణకు ఆహ్వానించే అవకాశముంది. అవసరమైతే సాంకేతిక లోపాలపై శాస్త్రీయ విచారణ చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. బోయింగ్ 787-8 విమానాలపై తీసుకోబోయే ఈ కీలక నిర్ణయం దేశీయ విమానయాన రంగ భద్రత ప్రమాణాలను మరింత కట్టుదిట్టంగా మారుస్తుందని అంచనా.