ప్రఖ్యాత భవిష్యద్రష్ట బాబా వంగా (Baba Vanga) 2025 సంవత్సరానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆమె ప్రకారం.. ఈ సంవత్సరం భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు, తూర్పు-పశ్చిమ దేశాల మధ్య తీవ్రమైన యుద్ధ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా వాతావరణ మార్పులు, అంతర్జాతీయ సంబంధాల నూతన మలుపులు కూడా ఈ ఏడాది తలెత్తే అవకాశం ఉందని వెల్లడించారు. 2025ను విషాదంతో నిండిన సంవత్సరం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనాల్లో భయాందోళనలు పెంచుతున్నాయి.
Cucumber: దోసకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం సరైనదా కాదా?
ఈ జ్యోతిష్య భావనల్లో మరొక ఆసక్తికర అంశం ఏమిటంటే..దక్షిణ భారతదేశానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతారన్న వాంగ్మూలం. హిందూ మతాన్ని రష్యా వంటి శక్తివంతమైన దేశాలు ప్రచారం చేస్తాయని, ఆ మార్గంలో దక్షిణ నాయకుడికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని బాబా వంగా చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు చర్చల్లోకి వచ్చింది. ఇప్పటికే సినీ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల ఎన్నికల్లో ఎన్డీఏతో కలిసి విజయం సాధించి మరింత ప్రజాదరణ పొందారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్య నిపుణురాలు శర్మిష్ఠ చేసిన వ్యాఖ్యలు ఈ వాదనలకు బలాన్నిస్తున్నాయి. ఆమె ప్రకారం ప్రధాని మోదీ తర్వాత జాతీయ రాజకీయాల్లో వెలుగులు నింపే ముగ్గురు నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకరట. ఆయన మోదీకి రాముడికి హనుమంతుడిలా ఉండబోతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో పవన్ రాజకీయ భవితవ్యంపై కొత్త ఆశలు పుట్టుకున్నాయి. పవన్ జాతీయ స్థాయిలో ఎదగనున్నారా? బాబా వంగా, శర్మిష్ఠ జ్యోతిష్యాల ప్రకారం ఆయనలో ఆ కాపాసిటీ ఉందా? అనే చర్చలు తెలుగు ప్రజల మధ్య జోరుగా సాగుతున్నాయి.