హై బీపీ.. లో బీపీ..
ఈ రెండింటిలో ఏది ప్రమాదకరం? అంటే.. లో బీపీ! ఎందుకంటే దీని వలన మెదడుకు ఆక్సిజన్, అవసరమైన పోషకాల సరఫరా ఆగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులను ఏర్పరుస్తుంది. కాబట్టి లో బీపీ ఉంటే.. ఆరోగ్య పరిస్థితిని విస్మరించకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషధాలు, ఆహార పదార్థాలను క్రమంగా తీసుకోవడం వల్ల లో బీపీ నుంచి కోలుకోవచ్చు.
వైద్య శాస్త్రం ప్రకారం డయాస్టోలిక్ ప్రెజర్ 95 mmHg దాటకూడదు. అలాగే సిస్టోలిక్ 140 mmHg మించకూడదు. ఇవి రెండూ చాలా తక్కువగా ఉంటే లో బీపీ ఉన్నట్లే. మహిళల్లో ఇది 60/100, మగవారిలో 70/110 కంటే తక్కువగా ఉంటే లో బీపీ ఉన్నట్లే. మనకు లో బీపీ ఉందా లేదా అన్నది కొన్ని లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు.
సాధారణంగా బ్లడ్ ప్రెజర్ అనేది మానవుల వయస్సు, లింగ నిర్ధారణ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మన దేశంలో హై బీపీపై జరుగుతున్నంత చర్చ లో బీపీపై జరగట్లేదు. ఎందుకంటే ఇది ఆడవారిలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆడవారికి లో బీపీ ఉన్నా.. సకాలంలో వైద్య పరీక్షలు చేయించక అది బయటపడటం లేదు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ రక్తస్రావం అయితే అది లో బీపీకి దారి తీయవచ్చు. కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్టుల వల్ల కూడా లో బీపీ వచ్చే అవకాశం ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే లో బీపీ ఉందంటే… శరీరంలో సరిపడా రక్తం లేదని అర్థం. అందువల్ల లో బీపీ లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆస్పత్రికి వెళ్లడం మంచిది. నీరు సరిపడా తాగాలి. రక్తం పెంచే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఎలాంటి టెన్షన్స్‌ను దరిచేరనీయకండి. ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం చేయండి.
లో బీపీ ముఖ్య కారణాలు..
* డీహైడ్రేషన్ వల్ల వాంతి, విరేచనాలు
* బ్లీడింగ్ – మధ్యస్థ స్థాయి నుంచి తీవ్ర స్థాయి దాకా
* అవయవాల వాపు, నొప్పి
* రుగ్మతలు – గుండె కొట్టుకునే వేగం తగ్గడం, గుండెలో రక్తం గడ్డకట్టడం లాంటివి
* విటమిన్ బి12 లోపం
* అడ్రినలిన్ హార్మోన్ సరైన మోతాదులో లేకపోవడం
* సెప్టిసీమియా
* వేసోవాగల్ రియాక్షన్స్
* పోస్టురల్ హైపో టెన్షన్
* మద్యం సేవించడం
* మాదకద్రవ్యాలను అతిగా సేవించడం
విటమిన్లు అవసరం..
విటమిన్ బి12, విటమిన్ ఇ అనేవి లో బీపీని సాధారణ స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. హై బీపీ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ విటమిన్ ఇ తీసుకోకూడదు. విటమిన్ బి12 అనీమియా చికిత్సలో ఉపయోగపడుతుంది. ఇది బీపీని పెంచడంలోనూ సహాయపడుతుంది. ఈ విటమిన్లను పొందడానికి బాదం పప్పు, పాలకూర, స్వీట్ పొటాటో, గుడ్లు, పాలు, చీజ్, చేపలు తినాలి. దీనికి అదనంగా వైద్యుడి సలహాతో విటమిన్ టాబ్లెట్లను కూడా తీసుకోవచ్చు.
ఇలా చేస్తే లో బీపీకి చెక్..
* రోజూ భోజనం తర్వాత ఒక కప్ కాఫీ తాగండి. కాఫీలోని కెఫిన్ అనే పదార్థం లో బీపీని కంట్రోల్‌లో ఉంచేందుకు దోహదం చేస్తుంది.
* బ్రెడ్, బియ్యం, షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్, బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. వీటిని ఎక్కువగా తీసుకుంటే లో బీపీ ముప్పు పెరుగుతుంది. ప్రోటీన్లు, బీన్స్, హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం మంచిది.
* కంటి నిండా నిద్రపోవాలి.
* భోజనం అతిగా తీసుకోవద్దు. మితాహారం మేలు.
* నీళ్లు బాగా తాగండి.
