ఎవరికైనా శృంగారం అంటే సంతోషంగా ఉంటుంది. ఇది మానసికంగా, శారీరకంగా ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుందని ఆనందిస్తారు. అందుకే జీవిత భాగస్వామితో వారానికి కనీసం రెండుసార్లు అయినా శృంగారంలో పాల్గొనాలని వైద్యులు చెబుతుంటారు. ఐర్లాండ్‌లోని ఒక వ్యక్తి తన భార్యతో అలాగే శృంగారంలో పాల్గొన్నాడు. కానీ ఆ పది నిమిషాలకే ఆయనకు మతి పోయింది. అంటే.. ఆ వ్యక్తికి మతిమరుపు వచ్చేసింది. అదేంటి.. భార్యతో శృంగారం చేస్తే మతిమరుపు ఎందుకు వస్తుంది అంటే.. అసలు కథ అక్కడే ఉంది.
ఐరిష్ జర్నల్ ప్రచురించిన దాని ప్రకారం.. 66 ఏళ్ల ఐరిష్ వ్యక్తి తన భార్యతో శృంగారం చేశాడు. తరువాత కాసేపు గడిచాక.. ఫోన్‌లో తేదీ చూసుకున్నాడు. ముందు రోజే తన పెళ్లిరోజు అని, దానిని మర్చిపోయానా అని ఆశ్చర్యపోయాడు. భార్యకు ఈ విషయం చెబితే.. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ ముందు రోజే వాళ్లు తమ పెళ్లిరోజును బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అది జరిగి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఆ విషయాన్ని ఎలా మర్చిపోయాడా అని షాకయ్యారు.
ఆ కుటుంబమంతా ఆయనకు పెళ్లిరోజు గురించి, పార్టీలో జరిగిన విషయాల గురించి పదే పదే చెప్పడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. పైగా ఆ వ్యక్తికి కూడా ఆ ఘటన తప్ప మిగిలినవన్నీ గుర్తున్నాయి. అంటే పేరు, వయసు, ఇతర విషయాలను మర్చిపోలేదు. ఆయనను పరీక్షించిన వైద్యులు చెప్పింది ఒక్కటే. ఆ వ్యక్తి ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా (TGA) తో బాధపడుతున్నారని తేల్చారు.
50 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్నవారికి ఇలాంటి అనారోగ్య సమస్య వస్తుంది. 2015లోనూ ఆ వ్యక్తికి ఇలాంటి ఆరోగ్య సమస్యే వచ్చింది. అప్పుడు కూడా భార్యతో శృంగారంలో పాల్గొన్న తరువాతే టీజీఏ ప్రభావానికి లోనయ్యాడు.
