Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.

ఈ కాలంలో చిన్న పిల్లలు, యువతీ యువకులు, పెద్దవారు అని తేడా లేకుండా చాలామంది డిప్రెషన్‌కు గురవుతున్నారు. డిప్రెషన్ అనేది పెద్ద సమస్య కాదు, అలాగని మనం శ్రద్ధ చూపకుండా ఉండే చిన్న సమస్య కూడా కాదు. ఇప్పటి తరం పిల్లలు స్కూళ్లలో చదువుల ఒత్తిడిని తట్టుకోలేక, కొంతమంది యువతీ యువకులు ప్రేమ విఫలమైనందువల్ల లేదా ఏదైనా ఉద్యోగం రాలేదని లేదా మనకు ఇష్టమైన వారు చనిపోయారని ఏదో ఒక విధమైన ఆలోచనతో డిప్రెషన్‌కు గురవుతున్నారు. దీన్ని […]

Published By: HashtagU Telugu Desk
What can be done to reduce depression? We can reduce it ourselves.

What can be done to reduce depression? We can reduce it ourselves.

ఈ కాలంలో చిన్న పిల్లలు, యువతీ యువకులు, పెద్దవారు అని తేడా లేకుండా చాలామంది డిప్రెషన్‌కు గురవుతున్నారు. డిప్రెషన్ అనేది పెద్ద సమస్య కాదు, అలాగని మనం శ్రద్ధ చూపకుండా ఉండే చిన్న సమస్య కూడా కాదు.

ఇప్పటి తరం పిల్లలు స్కూళ్లలో చదువుల ఒత్తిడిని తట్టుకోలేక, కొంతమంది యువతీ యువకులు ప్రేమ విఫలమైనందువల్ల లేదా ఏదైనా ఉద్యోగం రాలేదని లేదా మనకు ఇష్టమైన వారు చనిపోయారని ఏదో ఒక విధమైన ఆలోచనతో డిప్రెషన్‌కు గురవుతున్నారు. దీన్ని మనమే గుర్తించి తగ్గించుకోవాలి. డిప్రెషన్‌లోకి వెళ్తున్నామని అనిపిస్తే మనమే కొన్ని పనుల ద్వారా దానిని తగ్గించుకోవాలి. లేదా ఎవరైనా డిప్రెషన్‌లో ఉన్నట్లు అనిపించినా మనం వారికి సహాయం చేయాలి.

ముందుగా మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో దానిని తెలిసిన, దగ్గరైన వ్యక్తులకు చెప్పడం వల్ల మనలోని బాధ తగ్గుతుంది. అదేవిధంగా మీకు ఎవరైతే నచ్చరో వారికి దూరంగా ఉండటం మంచిది. అలాగే మనం తినే ఆహారంలో తాజా కూరగాయలను, పండ్లను చేర్చుకోవడం వల్ల కొంత ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇంకా మనం రోజూ కొన్ని రకాల వ్యాయామాలను చేయడం వల్ల కూడా ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.

ముఖ్యంగా ధ్యానం చేయడం వల్ల మన మనసును అదుపులో ఉంచుకుని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మనం రోజూ నిద్రపోయే సమయంలో మనకు నచ్చని విషయాల గురించి గానీ, వ్యక్తుల గురించి గానీ ఆలోచించడం మంచిది కాదు. మనం హాయిగా నిద్రపోవడం వల్ల డిప్రెషన్ చాలా వరకు తగ్గుతుంది.

ఒత్తిడి వల్ల మద్యపానం తాగడం అలవాటు చేసుకున్నట్లయితే దానిని మానేయడం మంచిది, లేకపోతే అది మన మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ధూమపానం అలవాటు ఉన్నా దానిని కూడా మానేయడం మంచిది, లేకపోతే క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి డిప్రెషన్ నుండి బయటపడటానికి ప్రశాంతమైన నిద్ర, వ్యాయామాలు చేయడం, ధ్యానం చేయడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, మనుషులతో మాట్లాడటం, ప్రకృతిని ఆస్వాదించడం వంటివి చేస్తే ప్రయోజనం ఉంటుంది.

  Last Updated: 09 Jun 2026, 10:17 AM IST