A man who fights the world…
but surrenders only to love ❤️Wishing our #RowdyJanardhana @TheDeverakonda a very Happy Birthday 🔥#HBDVijayDeverakonda@keerthyofficial @storytellerkola @christoxavier_ #AnendCChandran @DinoShankar @PraveenRaja_Off @SVC_official @Tseries… pic.twitter.com/FVIWVYQ0UH
— Sri Venkateswara Creations (@SVC_official) May 9, 2026
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘రౌడీ జనార్ధన’ నుంచి చిత్రబృందం ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఈ స్టిల్ మరింత ఆసక్తిని పెంచింది.
విడుదల చేసిన ఈ కొత్త పోస్టర్‌లో విజయ్ దేవరకొండ వర్షంలో తడుస్తూ, చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉన్నారు. ఓ యువతి పాదాలను ఆయన తన ఛాతీపై ఉంచుకుని, రొమాంటిక్‌గా చూస్తూ కనిపించారు. చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. “ప్రపంచంతో పోరాడే మనిషి… కానీ ప్రేమకు మాత్రమే లొంగిపోతాడు. మా రౌడీ జనార్ధన విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని క్యాప్షన్ జోడించింది.
‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో గుర్తింపు పొందిన రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో విజయ్ దేవరకొండ సరికొత్త గెటప్, డైలాగ్ డెలివరీతో మాస్ అవతారంలో కనిపించి అంచనాలు పెంచేశారు.
1980ల కాలంలో తూర్పు గోదావరి జిల్లా నేపథ్యంలో సాగే ఈ కథను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
