Site icon HashtagU Telugu

Srileela : మరో ఫ్లాప్ తప్పించుకున్న శ్రీలీల..!

Srileela Lucky Chance with Naga Chaitanya

Srileela Lucky Chance with Naga Chaitanya

ధమాకాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీలీల ఆ సినిమా క్రేజ్ తో అరడజనుకి పైగా స్టార్ ఛాన్సులు అందుకుంది. అయితే అన్ లక్కీగా ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. భగవంత్ కేసరి, గుంటూరు కారం హిట్ పడ్డా అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. అందుకే శ్రీలీల ని తీసుకోవాలని దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించట్లేదు. ప్రస్తుతం శ్రీలీల నితిన్ తో రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తుంది. ఆల్రెడీ నితిన్ తో ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ సినిమాలో నటించింది శ్రీ లీల. ఐతే ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.

ఇదిలాఉంటే శ్రీలీల (Srileela) ఒక ఫ్లాప్ సినిమా నుంచి తప్పించుకుందని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వచ్చిన గోట్ (Vijay GOAT) సినిమా ఈమధ్యనే రిలీజైంది. ఈ సినిమాలో త్రిష (Trisha) ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ కి ముందు శ్రీ లీలని అనుకున్నారు స్టార్ సినిమా అంటే నో చెప్పకుండా చేయాల్సి ఉన్నా కూడా శ్రీలీల మాత్రం అందుకు నిరాకరించింది.

శ్రీలీల గుడ్ డెసిషన్..

ఐతే విజయ్ గోట్ సినిమా ఆఫర్ కాదన్న శ్రీలీల గుడ్ డెసిషన్ అంటున్నారు. శ్రీలీల కెరీర్ ప్రస్తుతం డైలమాలో ఉంది. తెలుగులో కేవలం నితిన్ సినిమా ఒకటి మాత్రమే చేతిలో ఉంది. ఐతే స్టార్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న శ్రీలీల అందులో మాత్రం వెనకబడి ఉంది.

విజయ్ గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ కాబట్టి అమ్మడు కాదన్నదని తెలుస్తుంది. తమిళ సినిమాల్లో లీడ్ హీరోయిన్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంది శ్రీలీల. తమిళంలో విజయ్ గోట్ ఆహా ఓహో అంటున్నారు కానీ సినిమా మిగతా అన్ని భాషల్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

Also Read : BiggBoss 8 First Elimination : బిగ్ బాస్ 8.. ఈ సీజన్ ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరు..?