Site icon HashtagU Telugu

Tollywood : పాపం శివాత్మిక…గట్టిగానే చూపిస్తుంది కానీ..చాన్సులే రావట్లే

Shivathmika Rajashekar

Shivathmika Rajashekar

చిత్రసీమ (Tollywood)లో రాణించాలంటే కేవలం బ్యాక్ గ్రౌండ్ , గ్లామర్ , యాక్టింగ్ ఉంటేనే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి. ఆలా అదృష్టం ఉన్నప్పుడే ఏ హీరోయిన్ కైనా ఛాన్సులు తలుపుతడుతుంటాయి. ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు (Heroins) అదృష్టం అటుంచి..జనాల్లో నిత్యం ఉండాలనే అతృతతో గ్లామర్ ను గట్టిగా నమ్ముకుంటున్నారు. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని అందాల ఆరబోత తో చాలామంది హీరోయిన్లు వైరల్ గా మారుతున్నారు. కొంతమంది నిర్మాతలైతే వీరి గ్లామర్ ను చూసి ఛాన్సులు ఇవ్వడం చేస్తున్నారు. దీంతో కొత్త హీరోయిన్ల దగ్గరి నుండి సీనియర్ హీరోయిన్ల వరకు సోషల్ మీడియా లో రెచ్చిపోయి..అందాలను చూపిస్తున్నారు.

తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక (Shivathmika Rajashekar) సైతం ఈ మధ్య సోషల్ మీడియా లో రెచ్చిపోతుంది. నిత్యం హాట్ హాట్ అందాలతో యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్న శివాత్మిక.. 2019లో విడుదలైన దొరసాని (Dorasani) సినిమా ద్వారా హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటాక ఇప్పుడిప్పుడు గాడిలో పడుతోంది. విలక్షణ కథలను ఎంచుకుంటూ తన రోల్‌కి ప్రాధాన్యమున్న పాత్రలకు ఓకే చెబుతోంది. అలాగే సోషల్ మీడియా లోను తగ్గేదెలా అంటుంది. చీరకట్టులోనే మోడ్రన్ డ్రెస్ లోను ఘాటైన అందాల ఆరబోత తో అబ్బా అనిపిస్తుంది. తాజాగా ఈమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. సెగలు రేపే అందాల ఆరబోతతో కెమెరా ముందు రచ్చ చేసింది. వీటిని చూసి చాలామంది నెటిజన్లు అమ్మడిలో ఈ రేంజ్ అందాలు కూడా ఉన్నాయా..అంటూ రొమాంటిక్ కామెంట్స్ వేస్తున్నారు.

Read Also : Hyderabad: హైదరాబాద్ రోడ్లపై గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులు రయ్ రయ్

Exit mobile version