Site icon HashtagU Telugu

Vijay Rashmika : విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక దీపావళి సెలెబ్రేషన్స్? మరోసారి దొరికేశారు..

Rashmika Mandanna Celebrating Diwali at Vijay Devarakonda House Rumours goes Viral

Rashmika Mandanna Celebrating Diwali at Vijay Devarakonda House Rumours goes Viral

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) మధ్య ఏదో ఉందని ఎప్పట్నుంచో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. గతంలో వీరు దీనిపై స్పందిస్తూ ఇద్దరం మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అంతే.. అంతకు మించి ఏం లేదు అని చెప్పారు. కానీ రష్మిక, విజయ్ ముంబైలో తిరుగుతున్నారని, మాల్దీవ్స్ కి కూడా కలిసి వెళ్లారని ఫొటోలతో సహా లీక్ అయ్యాయి.

ఇద్దరు విడివిడిగా ఫోటోలు పెట్టినా బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ ఒకేలా ఉండటంతో ప్రతిసారి ఈ జంట దొరికిపోతున్నారు. గతంలో మాల్దీవ్స్ కి వెళ్లి కూడా వేరు వేరుగా ఫోటోలు పెట్టినా, లోకేషన్ తో దొరికిపోయారు. అలాగే గతంలో ఓ పండగకి రష్మిక.. విజయ్ ఇంట్లో సెలెబ్రేట్ చేసుకుందని వాళ్ళు షేర్ చేసిన ఫొటోలతో తెలిసిపోయింది. తాజాగా మరోసారి ఈ జంట దొరికేశారు అని అంటున్నారు నెటిజన్లు.

దీపావళి సందర్భంగా విజయ్ దివాళీ(Diwali) సెలెబ్రేషన్ కి సంబంధించి పలు ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక రష్మిక కూడా ఒక ఫొటో షేర్ చేసి దీపావళి విషెష్ చెప్పింది. అయితే ఈ రెండు ఫొటోల్లో పక్కన ఉన్న గోడ డిజైన్ ఒకటే కావడం, పైన వేలాడుతున్న లైట్స్ ఒకటే కావడంతో రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే దీపావళి జరుపుకుందని, ఫొటోలతో మరోసారి దొరికేశారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో మరోసారి ఈ జంట లవ్ లో ఉన్నారా? లేక డేటింగ్ లో ఉన్నారా ? లేక వాళ్ళు చెప్పినట్టు కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనా అని ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై ఎప్పటిలాగే రష్మిక, విజయ్ స్పందించకుండా సైలెంట్ గా ఉన్నారు.

 

Also Read : Varun Lavanya : పెళ్లి తర్వాత అత్తారింట్లో లావణ్య మొదటి దీపావళి.. ఫ్యామిలీతో కలిసి..