Prabhas : ప్రభాస్ తో కూడా ఆ హీరోయినే.. యానిమల్ డైరెక్టర్ ప్లాన్ అదుర్స్..!

Prabhas రీసెంట్ గా యానిమల్ తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ సందీప్ వంగ తన నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా క్రేజీగా

Published By: HashtagU Telugu Desk
Why Rashmika skip 100 Crores Movie

Why Rashmika skip 100 Crores Movie

Prabhas రీసెంట్ గా యానిమల్ తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ సందీప్ వంగ తన నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా క్రేజీగా ఉన్నారు. యానిమల్ తర్వాత సందీప్ వంగ యానిమల్ పార్క్ కూడా చేస్తాడని తెలుస్తుంది. అయితే స్పిరిట్ ముందు చేస్తాడని తెలుస్తుండగా ఆ తర్వాతే యానిమల్ పార్క్ ఉంటుంది.

అయితే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్నని తీసుకుంటున్నారట. యానిమల్ లో రష్మిక మందన్న గీతాంజలి పాత్రలో నటించింది. సినిమాలో ఆమె నటనకు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తన క్రేజ్ డబుల్ చేసుకున్న రష్మిక సందీప్ తర్వాత చేస్తున్న స్పిరిట్ ఛాన్స్ కూడా అందుకుందని తెలుస్తుంది.

స్పిరిట్ సినిమా పై రెబల్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. ప్రభాస్ నటించిన సలార్ లాస్ట్ డిసెంబర్ లో రిలీజై సక్సెస్ అందుకోగా మే నెలలో కల్కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజా డీలక్స్ సినిమా మాత్రం 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

Also Read : Vijay Devarakonda : బోయపాటితో రౌడీ స్టార్.. ఈ కాంబో అస్సలు ఊహించలేదుగా..?

  Last Updated: 09 Feb 2024, 07:04 PM IST