Payal Rajput Mangalavaram : పాయల్ రాజ్ పుత్ కి కలిసి వచ్చేలా మంగళవారం..!

Payal Rajput Mangalavaram ఆరెక్స్ 100 తర్వాత పాయల్ రాజ్ పుత్ ఆ రేంజ్ హిట్ అందుకోలేదు. ఆరెక్స్ 100 సినిమా చూశాక ఆమెకు అన్నీ ఆ సినిమాలో లాంటి

Published By: HashtagU Telugu Desk
Payal Rajput Mangalavaram High Expectations

Payal Rajput Mangalavaram High Expectations

Payal Rajput Mangalavaram ఆరెక్స్ 100 తర్వాత పాయల్ రాజ్ పుత్ ఆ రేంజ్ హిట్ అందుకోలేదు. ఆరెక్స్ 100 సినిమా చూశాక ఆమెకు అన్నీ ఆ సినిమాలో లాంటి పాత్రలే వచ్చాయి. అయితే అందులో కొన్నిటిని కాదని కొన్నిటిని ఓకే చేసింది. అవకాశాలు వచ్చినా రాకపోయినా ఆమె అలానే టఫ్ టైం లో కూడా స్ట్రాంగ్ గా ఉంది పాయల్ రాజ్ పుత్. పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ మూవీ మంగళవారం (Mangalavaram) సినిమా ట్రైలర్ సర్ ప్రైజ్ చేసింది.

ఆరెక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి మరో సెన్సేషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ మహా సముద్రం (Maha Samudram) టార్గెట్ మిస్ అవగా మంగళవారం తో ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడు అజయ్ భూపతి (Ajay Bhupathi). సినిమాలో పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) మెయిన్ లీడ్ కాగా ఆమె చుట్టే కథ తిరుగుతుందని తెలుస్తుంది.

Also Read : Trivikram Son Rishie : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న త్రివిక్రం వారసుడి ఫోటో.. డిటో గురూజీ అంటూ కామెంట్స్..!

అంతేకాదు ఈ సినిమా కచ్చితంగా పాయల్ రాజ్ పుత్ కెరీర్ కు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ట్రైలర్ తోనే అదుర్స్ అనిపించగా తప్పకుండా సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అనిపిస్తుంది. పాయల్ రాజ్ పుత్ కూడా ఇది తనకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది అంటూ మంగళవారం గురించి చాలా ఎగ్జైట్ అవుతుంది.

అజయ్ పాయల్ ఈ కాంబో లో వస్తున్న మంగళవారం హిట్ పడితే మాత్రం నిజంగానే పాయల్ కి అజయ్ భూపతి లక్కీ హ్యాండ్ అని ఫిక్స్ అవ్వొచ్చు. ఈ మంగళవారం సినిమా కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్. సినిమా కథ ఏంటన్నది ట్రైలర్ లో సస్పెన్స్ గా ఉంచగా తప్పకుండా ఆడియన్స్ కి ఈ సినిమా ఒక సూపర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతుందని మాత్రం అర్ధమవుతుంది.

  Last Updated: 21 Oct 2023, 10:06 PM IST