Ashika Ranganath Glamour Photoshoot కన్నడ భామ ఆషిక రంగనాథ్ లేటెస్ట్ గా టాలీవుడ్ లో హిట్ బోణీ కొట్టింది. ఆల్రెడీ కన్నడలో వరుస సినిమాలు చేస్తున్న ఆషిక రంగన్నాథ్ తెలుగులో కళ్యాణ్ రాం తో అమిగోస్ సినిమాలో నటించింది. ఆ సినిమా అంతగా వర్క్ అవుట్ కాలేదు. అయితే అమ్మడు రీసెంట్ గా కింగ్ నాగార్జునతో కలిసి నా సామిరంగ సినిమాలో నటించింది.
We’re now on WhatsApp : Click to Join
ఆ సినిమాలో అమ్మడి పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. సీనియర్ హీరో సినిమాతో సత్తా చాటిన ఆషిక పేరు ఇండస్ట్రీలో మారు మోగుతుంది. ఇక నుంచి సీనియర్ హీరోలకు అమ్మడు పర్ఫెక్ట్ పెయిర్ అని కూడా అంటున్నారు.
హిట్ జోష్ లో ఉన్న ఆషిక తన ఇంట్లో సోదరి మ్యారేజ్ తో మరింత ఖుషిగా కనిపించింది. ఆ ఈవెంట్ లో అందమంతా కూడా ఆషిక లోనే ఉంది అనేలా అమ్మడు తయారైంది. ఇక ఆ తర్వాత మళ్లీ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని మెప్పించింది. ఆషిక రంగన్నాథ్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్లాక్ శారీలో అమ్మడు అందాల ఘాటు ఓ రేంజ్ లో ఉంది.
హిట్టు పడ్డాక సైలెంట్ గా ఉంటే ఏం బాగుంటుంది అందుకే ఆషిక ఇలా రెచ్చిపోతుంది. అసలే హిట్ ఫాం లో ఉన్న ఆషికా అందరికి స్పెషల్ అనిపిస్తుండగా ఇప్పుడు ఈ ఫోటో షూట్స్ తో మరింత క్రేజీగా మారింది. నా సామిరంగ తర్వాత ఆమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారని తెలుస్తుంది.
ఐతే ఈ టైం లోనే ఆషిక ఆచి తూచి కథల ఎంపిక చేసుకుంటేనే ఆమె కెరీర్ బాగుంటుంది. సినిమాల విషయం ఏమో కానీ ఫోటో షూట్స్ తో మాత్రం అమ్మడు కుర్రాళ్ల హృదయాలను గిల గిల కొట్టుకునేలా చేస్తుందంటే నమ్మాల్సిందే.
Also Read : Ooruperu Bhairavakona will postpone : సందీప్ కిషన్ వెనక్కి తగ్గక తప్పట్లేదా.. భైరవ కోన మరోసారి వాయిదా..?