Site icon HashtagU Telugu

Prabhas Salaar 2 : ప్రభాస్ సలార్ 2 లో మలయాళ స్టార్..?

Malayala Star in Prabhas Salaar 2

Malayala Star in Prabhas Salaar 2

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ 1 సీజ్ ఫైర్ రెబల్ ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ పెట్టేసింది. ప్రభాస్ (Prabhas) మాస్ సినిమా చేస్తే బాక్సాఫీస్ దగ్గర హడావిడి ఎలా ఉంటుందో చూపించిన సినిమా సలార్ 1. ఐతే ఈ సినిమా అసలు కథ సలార్ 2 లోనే ఉందని తెలుస్తుంది. దేవ వర్సెస్ వరద రాజ మన్నార్ మధ్య ఫైటింగ్ సెకండ్ పార్ట్ లో అంతకుమించి అనిపించేలా ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ 2 శౌర్యాంగ పర్వం సినిమా విషయంలో ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని టాక్.

రెండు సినిమాల తర్వాత సలార్ 2..

ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత హను రాఘపుడితో ఫౌజీ లైన్ లో ఉంది. దీనితో పాటు సందీప్ వంగాతో స్పిరిట్ కూడా వస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత సలార్ 2 ఉండే ఛాన్స్ ఉంది. ఐతే సలార్ 2 (Salaar 2) స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనుల్లో ఉన్న ప్రశాంత్ నీల్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో మలయాళ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) ని తీసుకుంటున్నారని తెలుస్తుంది.

సినిమా సెట్స్ మీదకు వెళ్లే టైం చాలా ఉన్నా పాత్రల గురించి ఒక క్లారిటీ రావాలనే ఉద్దేశంతో మోహన్ లాల్ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబో ఎలా ఉంటుందో సలార్ 1 లో చూపించారు సలార్ 2 అంతకు డబుల్ మాస్ కమర్షియల్ సినిమాగా ఇది రబోతుంది.

ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ తో ఒక సినిమా కమిటయ్యాడు. దేవర తర్వాత తారక్ ఇమిడియెట్ గా ఆ సినిమానే చేస్తాడు కాబట్టి ప్రశాంత్ నీల్ తారక్ తో సినిమా పూర్తి కాగానే సలార్ 2 సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది.

Also Read : BiggBoss 8 : నాగార్జున కన్నా మూడు రెట్లు ఎక్కువ..!