Prabhas: కృతి సనన్, ప్రభాస్ మధ్య భారీ రొమాన్స్..!

దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఆది పురుష్.

Published By: HashtagU Telugu Desk
Krithi Sanan Prabhas

Krithi Sanan Prabhas

దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ గా రూపుదిద్దుకుంటోన్న విషయం కూడా తెలిసిందే. అయితే హీరోయిన్ కృతి సనన్ ప్రభాస్ లాంటి పర్ఫెక్ట్ ప్యాడ్ పెర్ఫార్మర్స్ తో కలిసి స్క్రీన్ పంచుకోవడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

అయితే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని సినీ పండితులు తెలిపారు. అయితే గత వారం ఆది పురుష్ టీమ్ ఈ సినిమాకు సంబంధించిన షూట్ చేసిన సీన్స్ ను ప్రదర్శించడం చేశారు. ప్రభాస్, కృతి సనన్ లపై షూట్ చేసిన సన్నివేశాలు బాగా వచ్చాయని చిత్ర బంధం వెల్లడించారు. అయితే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వచ్చిందని సినీ పండితులు అంటున్నారు.

ఇకపోతే ఆది పురుష్ సినిమా 2023 జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ విషయానికొస్తే.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరుసగా అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తుండడం విశేషం. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్,సినిమాతో పాటుగా సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

  Last Updated: 02 Jul 2022, 09:41 PM IST