Iswarya Menon : స్పైసి లుక్ లో ఐశ్వర్య మీనన్

Iswarya Menon : టాప్ టు బాటమ్ పింక్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్‌లో ఫొటోలు షేర్ చేసిన ఐశ్వర్య, కుర్రకారును పిచ్చెక్కిస్తోంది

Published By: HashtagU Telugu Desk
Iswarya Menon

Iswarya Menon

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘స్పై’ మూవీలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, హీరో కార్తికేయ సరసన ‘భజేవాయు వేగం’ చిత్రంతో మరో హిట్ అందుకుంది. ప్రస్తుతం మలయాళంలో ‘బజూక’ అనే సినిమాతో బిజీగా ఉండగా, తెలుగులో మరో ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే సినిమాల్లో మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఐశ్వర్య, లేటెస్ట్ ఫోటోషూట్‌తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది.

Shiva: పరమేశ్వరుడికి పూజ చేస్తున్నారా.. అయితే పొరపాటున కూడా తప్పులు అస్సలు చేయకండి!

తాజాగా టాప్ టు బాటమ్ పింక్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్‌లో ఫొటోలు షేర్ చేసిన ఐశ్వర్య, కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. నడుము వయ్యారాలు, స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న ఆమె లుక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ స్టైలిష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కామెంట్స్ విరివిగా వస్తున్నాయి. “స్టన్నింగ్ గ్లామర్” అని కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరు “తెలుగులో మరిన్ని హిట్ సినిమాలు ఇవ్వాలి” అంటూ ఆకాంక్షిస్తున్నారు.

Posani Arrest : పోసాని కోసం రంగంలోకి దిగిన వైసీపీ లాయర్లు

స్పై ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మరో ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. తన స్టైలిష్ లుక్, బోల్డ్ గ్లామర్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామ, టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు అందుకోవడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు ట్రెండ్ అవుతుండటంతో, త్వరలోనే మరో బిగ్ ప్రాజెక్ట్‌కు సైన్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐశ్వర్య మరో బ్లాక్‌బస్టర్ అందుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

  Last Updated: 27 Feb 2025, 01:56 PM IST