Site icon HashtagU Telugu

Neeta Ambani Gift: కోడలికి అత్యంత ఖ‌రీదైన గిఫ్ట్ ఇచ్చిన నీతా అంబానీ.. బ‌హుమ‌తి ధ‌ర రూ. 640 కోట్లు..!

Neeta Ambani Gift

Neeta Ambani Gift

Neeta Ambani Gift: నీతా అంబానీ- ముఖేష్ అంబానీలు అంబానీ కుటుంబం సాంప్రదాయ వైభవాన్ని, గొప్పతనాన్ని మరోసారి అందరికీ చూపించారు. చిన్న కొడుకు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహం తరువాత నీతా తన కోడలు రాధిక మర్చంట్‌కి అద్భుతమైన బహుమతిని (Neeta Ambani Gift) అందించారు. నీతా అంబానీ కోడలు రాధిక మర్చంట్‌కి దుబాయ్‌లో ఉన్న ఒక గ్రాండ్, విలాసవంతమైన విల్లా బ‌హుమ‌తిగా ఇచ్చారట‌. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అని తెలుస్తోంది. ఈ విల్లా రాధికకు కూడా ఆశ్చర్యం కలిగించింద‌ని స‌మాచారం. ఈ విలాసవంతమైన విల్లా ప్రత్యేకత గురించి తెలుసుకుందాం.

నీతా తన కోడలికి బహుమతిగా విలాసవంతమైన విల్లా

నీతా అంబానీ ఇటీవల దుబాయ్‌లోని రాధిక మర్చంట్‌కి దాదాపు రూ.640 కోట్ల విలువైన విల్లాను బహుమతిగా ఇచ్చారు. ఈ విల్లా దుబాయ్‌లోని పామ్ జుమేరా ప్రాంతంలో ఉంది. నగరంలోని అత్యంత ఖరీదైన ఆస్తులలో ఒకటి. విలాసవంతమైన ఇంటీరియర్, డెకరేషన్, 70 మీటర్ల పొడవైన బీచ్ ఈ విల్లా ప్రత్యేకత. ఈ విల్లాలో వివాహిత జంటకు పూర్తి గోప్యత కల్పించడానికి పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు.

Also Read: ​Papaya For Breakfast: అల్పాహారంలో బొప్పాయి తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

విల్లాలో 10 లగ్జరీ బెడ్‌రూమ్‌లు

విల్లాలో 10 లగ్జరీ బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. వీటిని ఇటాలియన్ మార్బుల్, అందమైన ఆర్ట్ వర్క్‌లతో అలంకరించారు. చక్కదనం, ఆడంబరం ఖచ్చితమైన సమ్మేళనాన్ని ప్రతి బెడ్ రూమ్‌లో చూడవచ్చు. విల్లాలో విశాలమైన డైనింగ్ రూమ్ కూడా ఉంది. ఇందులో గ్రాండ్ డైనింగ్ టేబుల్ కూడా ఉంది. ఇది అంబానీ కుటుంబానికి చెందిన గ్రాండ్ పార్టీలకు సరైన సెట్టింగ్‌గా మారింది. విల్లాలో అత్యాధునికమైన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇది చల్లదనం, రిఫ్రెష్‌మెంట్ కోసం సరైనది. ఇక‌పోతే అనంత్ అంబానీ- రాధిక ఇటీవ‌ల పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ పెళ్లికి అక్ష‌రాల రూ. 5 నుంచి 6 వేల కోట్లు పెట్టిన‌ట్ల నివేదిక‌లు వ‌చ్చాయి.

Exit mobile version