Scrap Vehicles : మనదేశంలో తుక్కుగా మార్చదగిన వాహనాలు ఎన్ని ఉన్నాయి.. తెలుసా ? 11 లక్షలు !! ఔను.. ఈ సంవత్సరం మార్చి 31 నాటికి 15 ఏళ్ల కంటే పాతవైన 11 లక్షల వాణిజ్య వాహనాలు మనదేశంలో ఉన్నాయి. 2027 మార్చి నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకునే వాహనాలు మరో 5.7 లక్షలు ఉంటాయని అంచనా వేస్తున్నాారు. ఇవన్నీ మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలే. ఈవివరాలను రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది.
Also Read :Yuvraj Singh : మంచు లక్ష్మి బర్త్ డే పార్టీ లో యువరాజ్ సింగ్ సందడి
ఇక్రా నివేదికలోని వివరాలు
- తుక్కుగా మార్చదగిన 11 లక్షల వాణిజ్య వాహనాల్లో కనీసం కొన్నైనా తుక్కుగా మారితే.. దేశంలో కొత్త వాహనాల విక్రయాలు పెరుగుతాయి. దీనివల్ల ఆటో మొబైల్ పరిశ్రమకు ఊతం లభిస్తుంది.
- 2021 మార్చిలో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛంద వాహన ఆధునికీకరణ కార్యక్రమం (తుక్కు విధానం) ప్రారంభించింది. ఇది 2023 ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చింది.
- తుక్కు విధానంలో (Scrap Vehicles) తొలి దశలో భాగంగా 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాలని ప్రపోజ్ చేశారు. మొదటి దశ కింద 9 లక్షలకుపైగా ప్రభుత్వ వాహనాలను తుక్కుగా మార్చాలని టార్గెట్ పెట్టుకున్నారు.
- తుక్కు విధానం రెండో దశలో భాగంగా ఈ సంవత్సరం జూన్ 1న వాహన వయసు కంటే దాని పటుత్వం ఆధారంగా తుక్కుగా మార్చాలని ప్రపోజ్ చేశారు.
- వాణిజ్య వాహనాలను తుక్కుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక కేంద్రాలను (ఆర్‌వీఎస్‌ఎఫ్) ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలకు 2024 ఆగస్టు 31 వరకు 44,803 ప్రైవేటు వాహనాల దరఖాస్తులు, 41,432 ప్రభుత్వ వాహన దరఖాస్తులు వచ్చాయి.
- తుక్కు విధాన నిబంధనల కింద లోహాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా వాహన తయారీ కంపెనీలకు ముడి సరుకు ఖర్చులు కూడా తగ్గుతాయి.
- దేశవ్యాప్తంగా మరిన్ని ఆర్‌వీఎస్‌ఎఫ్‌లను ఏర్పాటు చేయాలని నిపుణులు అంటున్నారు.
- వాహనాలను తుక్కుగా మార్చేందుకు తగిన ప్రోత్సాహకాలను అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.