YS Sharmila Son Rajareddy : ప్రేమలో పడ్డ వైస్ షర్మిల కుమారుడు..? అమ్మాయిది ఏ కులమో తెలుసా..?

  • Written By:
  • Publish Date - December 2, 2023 / 02:38 PM IST

వైస్ షర్మిల (YS Sharmila Son ) కుమారుడు వైస్ రాజారెడ్డి (Rajareddy) ప్రేమలో పడ్డాడా..? అది కూడా రెడ్డి కులం అమ్మాయిని కాకుండా మరో కులం అమ్మాయితో..? ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య తన తల్లి షర్మిల తో ఎయిర్ పోర్ట్‌లో కనిపించిన వైఎస్ రాజారెడ్డి మీడియా లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజా రెడ్డి ని చూసి సినీ హీరో కూడా పనికిరాడని..అంత బాగున్నాడని అంత మాట్లాడుకోవడం , కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అంతే కాదు ఆల్రెడీ రాజారెడ్డి సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని..పూరి జగన్నాధ్ డైరెక్షన్లో ఏంటీ ఇవ్వబోతున్నాడని ఇలా ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఇప్పుడు ప్రేమలో ఉన్నాడనే వార్త అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.

రాజారెడ్డి.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త వైరల్ గా మారింది. ఏపీలో రెడ్డి, కమ్మ వర్గాల మధ్య రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఆ రెండు వర్గాల రాజకీయాలు నాటి నుంచి నేటి వరకూ కాకరేపుతుంటాయి. రెడ్డి వర్సెస్‌ కమ్మ పాలిటిక్స్‌ నేపథ్యంలోనే ఇప్పటి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో వైఎస్‌ షర్మిల తనయుడి పెళ్లి పొలిటికల్‌గా చర్చకు దారి తీస్తుంది.

అమెరికా ;లో చదువుకుంటున్న రాజారెడ్డి నాలుగేళ్లుగా అట్లూరి ప్రియతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నాలుగేళ్ల వీరి ప్రేమ ప్రయాణం ఇప్పుడు పెళ్లి పీటల వరకు వెళ్లిందని..ఇరు కుటుంబ సభ్యులు పెళ్ళికి ఓకే చెప్పారని..త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు చెప్తున్నారు. మరి ఈ ప్రేమ వార్తల్లో ఎంత నిజం ఉందనేది క్లారిటీ రావాల్సి ఉంది.