Gas cylinder: గ్యాస్ సిలిండర్ తేలేదని.. ఫినాయిల్ తాగిన భార్య..

Suicide Attempt అనంతపురం జిల్లాలో ఒక చిన్న కుటుంబ కలహం తీవ్ర విషాదానికి దారితీసింది. వంట గ్యాస్ సిలిండర్ తీసుకురావడం లేదని మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తొండపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ, మహాలక్ష్మి దంపతులు. వారి ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయి మూడు నెలలు గడిచింది. సిలిండర్ తీసుకురావాలని మహాలక్ష్మి తన భర్తను చాలాసార్లు కోరింది. అయితే, డబ్బులు […]

Published By: HashtagU Telugu Desk
Lpg Gas Cylinder

Lpg Gas Cylinder

Suicide Attempt అనంతపురం జిల్లాలో ఒక చిన్న కుటుంబ కలహం తీవ్ర విషాదానికి దారితీసింది. వంట గ్యాస్ సిలిండర్ తీసుకురావడం లేదని మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తొండపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ, మహాలక్ష్మి దంపతులు. వారి ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయి మూడు నెలలు గడిచింది. సిలిండర్ తీసుకురావాలని మహాలక్ష్మి తన భర్తను చాలాసార్లు కోరింది. అయితే, డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో అతను వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో మహాలక్ష్మి మూడు నెలలుగా కట్టెల పొయ్యిపైనే వంట చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

ఆదివారం డబ్బులు సర్దుబాటు కావడంతో హరికృష్ణ సిలిండర్ కోసం గుత్తి పట్టణానికి వెళ్లాడు. కానీ, అక్కడ సిలిండర్ అందుబాటులో లేకపోవడంతో ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. భర్త మళ్లీ సిలిండర్ తేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన మహాలక్ష్మి, ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగేసింది.

కొంతసేపటికి అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గమనించిన భర్త, కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది.

  Last Updated: 30 Mar 2026, 10:27 AM IST