Visakhapatnam: విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. పటాకుల దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు!

విశాఖపట్నంలోని అత్యంత రద్దీగా ఉండే కొత్త గాజువాక మార్కెట్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడున్న ‘శివ ఫైర్‌వర్క్స్’ అనే టపాసుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దుకాణం నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ ఎగసిపడటంతో మార్కెట్ రోడ్డు అంతా గందరగోళంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. […]

Published By: HashtagU Telugu Desk
Massive fire in Visakhapatnam's Gajuwaka; flames raging at a firecracker shop!

Massive fire in Visakhapatnam's Gajuwaka; flames raging at a firecracker shop!

విశాఖపట్నంలోని అత్యంత రద్దీగా ఉండే కొత్త గాజువాక మార్కెట్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడున్న ‘శివ ఫైర్‌వర్క్స్’ అనే టపాసుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దుకాణం నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ ఎగసిపడటంతో మార్కెట్ రోడ్డు అంతా గందరగోళంగా మారింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఈ అగ్నిప్రమాద ఘటన కారణంగా కొత్త గాజువాక మార్కెట్ ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

ఈ ప్రమాదంపై విశాఖ సౌత్ ఏసీపీ శ్రీనివాస్ స్పందిస్తూ ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. ప్రమాదానికి గురైన ‘శివ ఫైర్‌వర్క్స్’ దుకాణానికి అసలు పోలీస్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు పర్మిషన్ నిరాకరించినప్పటికీ… దుకాణ యజమాని నేరుగా కోర్టును ఆశ్రయించి, అనుమతి ఉత్తర్వులు తెచ్చుకుని మరీ ఇక్కడ దుకాణాన్ని నడుపుతున్నట్లు ఏసీపీ వివరించారు.

జనావాసాలు దట్టంగా ఉండే ప్రాంతాలు, వ్యాపార కూడళ్ల వద్ద ఇలాంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు, బాణసంచా విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఏసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. కోర్టు అనుమతులు ఉన్నప్పటికీ, నిబంధనల ఉల్లంఘన, ప్రజా భద్రతకు ముప్పు కలిగించినందుకు గానూ సదరు షాపు యజమానిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

  Last Updated: 18 Jun 2026, 01:20 PM IST