Site icon HashtagU Telugu

JC Prabhakar Number: జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ కావాలని.. తాడిపత్రిలో కొత్త వివాదం

JC Prabhakar Number

JC Prabhakar Number

JC Prabhakar Number: తాడిపత్రిలో మరో కొత్త వివాదం మొద‌లైంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ (JC Prabhakar Number) కావాలని ఏకంగా తాడిపత్రి సీఐకు రామ్ పుల్లయ్య అనే వ్యక్తి ఫోన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. బండారు రామ పుల్లయ్య అనే వ్యక్తి ఫైట్ ఫర్ కాన్స్టిట్యూషన‌ల్‌ రైట్స్ అనే సంస్థకు ఫౌండర్ అని తెలుస్తోంది. జేసీ నన్ను బెదిరిస్తున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ కావాలని సీఐని రామ్ పుల్లయ్య అనే వ్యక్తి బెదిరించిన‌ట్లు స‌మాచారం. సీఐని రామ్ పుల్లయ్య అనే వ్యక్తి బూతులు తిట్టిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే ఇదంతా ట్రాప్ గా పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అదే పనిగా సీఐని రెచ్చగొట్టి ఆ కాల్ రికార్డింగ్‌ను సోషల్ మీడియాలో రామ్ పుల్లయ్య అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. దీనిపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీఐని కావాలని రెచ్చగొట్టి ఆ వ్యాఖ్యలు అనేలా చేసిన‌ట్లు పోలిసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అంతకు ముందు జేసీ ప్రభాకర్ రెడ్డితో ఫోన్ మాట్లాడి ఆ కాల్ రికార్డింగ్స్‌ని రామ్ పుల్ల‌య్య‌ సోషల్ మీడియాలో వైరల్ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై సీఐ సాయి ప్రసాద్ కి రామ్‌ పుల్లయ్య ఫోన్ చేసిన‌ట్లు స‌మాచారం. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ కోసం ఇరువురి మధ్య‌ వాగ్వాదం చోటుచేసుకుంది. కావాలనే సీఐ సాయి ప్రసాద్‌ని రామ్ పుల్ల‌య్య‌ రెచ్చగొట్టి ఇరికించారని తాడిపత్రిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: Saif Ali Khan – Auto Rickshaw: సైఫ్‌ అలీఖాన్‌ను ఆటోలో ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారు ? ఎవరు తీసుకెళ్లారు ?

ఇటీవ‌ల జేసీ ప్ర‌భాక‌ర్ బీజేపీపై విమ‌ర్శ‌లు

ఇక‌పోతే జేసీ ప్ర‌భాక‌ర్ ఇటీవ‌ల న్యూ ఇయ‌ర్‌కు ముందు బీజేపీపై హాట్ కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ ప్ర‌భుత్వం న‌డుస్తుంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. మీకంటే జ‌గ‌న్ రెడ్డే మేలు క‌దా అని జేసీ విమర్శించారు. దీనిపై బీజేపీ మంత్రి సైతం అసంతృప్తి వ్య‌క్తం చేశారు.