VRO Jayalakshmi Suspended : వరద బాధితుడిపై చెయ్యి చేసుకున్న వీఆర్వో సస్పెండ్

VRO Jayalakshmi Suspended : తమకు ఆహారం, నీళ్లు రావడం లేదని వరద బాధితుడు ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన వీఆర్వో జయలక్ష్మీ అతడిని చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం వీఆర్వోపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది.

Published By: HashtagU Telugu Desk
Vro Jayalakshmi Suspended

Vro Jayalakshmi Suspended

VRO Jayalakshmi Suspended : విజయవాడ (Vijayawada) లో వరద బాధితుడిని చెంపదెబ్బ కొట్టిన VRO జయలక్ష్మి (VRO Jayalakshmi)పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ (Suspend) చేసింది. వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం (AP Govt) అండగా నిలబడి, వారికి ఉచితంగా సరుకులు అందజేసిన సంగతి తెలిసిందే. ఏ ఒక్కరు కూడా మాకు అందలేదు అనే మాట రాకుండా ఇంటింటికి వెళ్లి అడిగి మరి ఇవ్వాలని ప్రభుత్వం హెచ్చరించడం తో అధికారులు ప్రతి ఇంటి గడపతొక్కుతూ బాధితులను పరామర్శిస్తూ సరుకులు అందజేశారు. ఇంత మంచి పని చేసిన ప్రభుత్వానికి VRO జయలక్ష్మి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. తమకు ఆహారం, నీళ్లు రావడం లేదని వరద బాధితుడు ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన వీఆర్వో జయలక్ష్మీ అతడిని చెంపదెబ్బ కొట్టింది. ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వం వీఆర్వోపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. వీఆర్వో జయలక్ష్మీని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

వరదతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉండాలని.. కోపంలోనో, అసహనంతోనో వారు ఒకమాట అన్నా.. అధికారులు ఓపిక పట్టాలి అని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ సీఎం ఆదేశాలు బేఖాతరు చేస్తూ కొంతమంది అధికారులు వరద బాధితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారు. వారితో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి అధికారులపై కొరడా ఝుళిపిస్తోంది ప్రభుత్వం. సోమవారం సింగ్ నగర్లో వరద బాధితులపై అకారణంగా చేయి చేసుకున్న వీఆర్వోను విధుల నుండి తొలగిస్తున్నట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోసారి అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Read Also : Assembly : అసెంబ్లీలో మూడు కమిటీలకు చైర్మన్ల నియామకం

  Last Updated: 09 Sep 2024, 10:39 PM IST