TTD Jagan : జ‌గ‌న్ జ‌మానాలో తిరుమ‌ల! మ‌త కుట్ర‌పై విప‌క్షాల ద‌రువు!

తిరుమ‌ల వెళ్లాలంటే భ‌య‌ప‌డేలా గ‌దులఅద్దెను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ (TTD Jagan) పెంచేసింది.

  • Written By:
  • Publish Date - January 12, 2023 / 03:23 PM IST

తిరుమ‌ల శ్రీవారి చెంత‌కు సామాన్యులు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డేలా గ‌దుల అద్దెను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ (TTD Jagan) 1100శాతం పెంచేసింది. ఆ విష‌యాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు (CBN) బ‌య‌ట‌పెడుతూ ప‌లు అనుమానాలు వ్య‌క్త‌ప‌రిచారు. పదే పదే గదుల అద్దెను పెంచ‌డాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. కలియుగ వైకుంఠం తిరుమల విషయంలో అహంకారం వద్దని హితవు పలికారు. కానీ, గ‌దుల అద్దెను పెంచ‌డాన్ని ప్ర‌భుత్వం స‌మ‌ర్థించుకుంటోంది. గ‌త 30ఏళ్లుగా అద్దెలు పెంచ‌లేద‌ని గుర్తు చేస్తోంది. ప్ర‌స్తుతం గ‌దుల‌ను ఆధునీక‌రించిన విష‌యాన్ని చెబుతూ అందుకైన ఖ‌ర్చును రాబ‌ట్టేందుకు నారణయగిరి గెస్ట్ హౌస్ లో రూ.150 ఉన్న అద్దెను రూ.1700లకు పెంచింది. స్పెషల్ టైప్ కాటేజీల అద్దె రూ.750 నుంచి రూ.2,200 లకు పెంచారు. సాధారణ భక్తులు బుక్ చేసుకునే రూ.50, రూ.100 గదుల అద్దెలను పెంపు ప్ర‌స్తుతానికి లేదని అధికారులు చెప్ప‌డం విడ్డూరం.

గ‌దుల అద్దెను స‌ర్కార్ 1100శాతం పెంచేసింది(TTD Jagan) 

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి తిరుమ‌ల కొండ మీద ఏదో అప‌చారం జ‌రుగుతుంద‌న్న అప‌వాదు(TTD Jagan) వినిపిస్తోంది. సామాన్య భ‌క్తుల‌ను దూరం చేసేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని విప‌క్ష నేత‌ల అనుమానం. మ‌త‌మార్పిడి అంశాలు కూడా పొడ‌చూపుతున్నాయ‌ని అనుమానం క‌లిగేలా విప‌క్షాలు సందేహాల‌ను వ్య‌క్తం చేయ‌డం ప‌రిపాటిగా మారింది. అందుకు త‌గిన విధంగా తిరుమ‌ల బ‌స్సు టిక్కెట్ల వెనుక జెరూస‌లెం యాత్ర ప్ర‌చారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన తొలి రోజుల్లో బ‌య‌ట ప‌డింది. ఆ త‌రువాత అన్య‌మ‌త ప్ర‌చారం, దేవాల‌యాల వ‌ద్ద క్రిస్టియ‌న్ల దుకాణాలు త‌దిత‌ర అంశాల‌ను విప‌క్ష నేత‌లు బ‌య‌ట‌కు తీసుకొచ్చారు.

Also Read : Brother Anil : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై వేరేలా `దేవుడి` స్క్రిప్ట్ ! బ్ర‌ద‌ర్ అనిల్ ప్ర‌బోధం!!

గ‌త ఏడాది ప‌లు దేవాల‌యాల్లో విగ్ర‌హాలు ధ్వ‌సం ఘ‌ట‌న‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో హ‌నుమాన్ , శ్రీరాముని, సాయిబాబా విగ్ర‌హాల ధ్వంసం, ఉత్స‌వ రథాలు త‌గుల‌బ‌డ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ను అభాసుపాలు చేసింది. రామ‌తీర్థం వ‌ద్ద శ్రీరాముని విగ్ర‌హం చేతుల‌ను న‌రికేశారు. ప‌లు చోట్ల హిందూ దేవాల‌యాల్లో దుర్ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ ఎక్క‌డా స‌రైనా విధంగా చ‌ర్య‌లు తీసుకోలేదు. పైగా ఎవ‌రో కుట్ర పూరితంగా ఇలా చేస్తున్నార‌ని, హ‌నుమాన్ విగ్ర‌హం చేతులు తెగితే ఏమౌతుంది? ర‌థం త‌గ‌ల‌బ‌డితే మ‌ళ్లీ చేయిస్తామంటూ అప్ప‌ట్లో మంత్రిగా ఉన్న కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని మీడియా ముందు చెప్ప‌డం విమ‌ర్శ‌ల‌ను మూట‌గ‌ట్టుకుంది.

చ‌ర్చిలు నిర్మాణం కోసం ప్ర‌త్యేకంగా నిధుల‌ విడుద‌ల(CBN)

రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చిలు నిర్మాణం కోసం ఇటీవ‌ల ఏపీ పంచాయ‌తీరాజ్ శాఖ ప్ర‌త్యేకంగా నిధుల‌ను విడుద‌ల చేసింది. అంతేకాదు, ప్ర‌తి నెలా ఫాస్ట‌ర్ల‌కు, ఇమాంల‌కు గౌర‌వ వేతనాల‌ను ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెల్లిస్తున్నారు. ఆ మేర‌కు జీవోల‌ను ప్ర‌త్యేకంగా విడుద‌ల చేయించారు. ప్ర‌తి గ్రామంలోనూ చ‌ర్చిల‌ను నిర్మించుకోవ‌డానికి అనువుగా సుమారు 1000కోట్ల‌ను ఇటీవ‌ల జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ విడుద‌ల చేసింది. మ‌సీదుల మ‌రమ్మ‌తులు ఇత‌ర‌త్రా అవ‌స‌రాల కోసం కూడా నిధుల‌ను ఇస్తోంది. కానీ, హిందూ దేవాల‌యాల ఆదాయాన్ని ప్ర‌భుత్వం లాగేసుకుంటోంద‌ని తొలి నుంచి బీజేపీ నిల‌దీస్తోంది. దేవాదాయ‌, ధ‌ర్మాదాయ‌శాఖ ప‌రిధి నుంచి దేవాల‌యాల‌ను త‌ప్పించాల‌ని హిందూవాదులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. హిందూ దేవాల‌యాల‌కు భ‌క్తులు ఇచ్చే విరాళాల‌ను అన్య‌మ‌త‌స్తుల‌కు ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తోంద‌ని ఆర్ఎస్ఎస్, విశ్వ‌హిందూప‌రిష‌త్ ఆరోపిస్తోంది. మ‌ఠాధిప‌తులు, పీఠాధిప‌తులు విజ‌య‌వాడ కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగిన సంద‌ర్భాన్ని చూశాం.

Also Read : TTD : భ‌క్తుల‌కు టీటీడీ షాక్‌.. వ‌స‌తి గృహాల అద్దెలు భారీగా పెంపు

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తిరుమ‌ల వెళ్లిన‌ప్పుడ‌ల్లా ఏదో ఒక వివాదం బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఆయ‌న డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌కుండా తిరుమ‌ల శ్రీవారికి ప‌ట్టు వ‌స్త్రాలు ఎలా స‌మ‌ర్పిస్తార‌ని హిందూవాదులు ప‌లు సంద‌ర్భాల్లో నిల‌దీశారు. అంతేకాదు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌తం ఏది? అంటూ నిల‌దీసిన విప‌క్ష నేత‌లు కూడా ఉన్నారు. ఇలా హిందూవాదుల నుంచి నిత్యం వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటోన్న సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజాగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నంకు వెళ్లే సామాన్య భ‌క్తులు భ‌రించ‌లేని విధంగా గదుల అద్దెను పెంచ‌డం మ‌రింత వివాదంగా మారింది.

కలెక్టరేట్ ల ఎదుట బీజేపీ ఆందోళన

తిరుమ‌ల అద్దె గ‌దుల ధ‌ర‌ల‌ను భారీగా పెంచ‌డాన్ని నిర‌సిస్తూ ఏపీ వ్యాప్తంగా కలెక్టరేట్ ల ఎదుట బీజేపీ ఆందోళన చేపట్టింది. సుదూర ప్రాంతాల నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులపై మరింత భారం మోపుతూ గదుల అద్దెను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీగా పెంచ‌డాన్ని నిర‌సిస్తోంది. గతంలో రూ.150 ఉన్న అద్దె ప్రస్తుతం రూ,1,700, రూ.200 ఉన్న గది అద్దెను రూ.2,200లకు పెంచ‌డాన్ని త‌ప్పుబ‌డుతోంది. ఇప్పటికే లడ్డూ ప్రసాదాల ధరలు పెంచిన టీటీడీ, తాజాగా గదుల అద్దెను భారీగా పెంచడంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతూ బీజేపీ ఆందోళ‌న‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు(CBN) మాత్రం శ్రీవారికి భ‌క్తుల‌ను దూరం చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆడుతోన్న గేమ్ గా భావిస్తున్నారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా తిరుమ‌ల‌కు భ‌క్తుల‌ను రాకుండా చేసేలా ఏపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హరిస్తోంద‌ని మండిప‌డుతున్నారు.

Also Read : TTD : 2022 సంవత్సరంలో తిరుమల శ్రీవారి ఆదాయం రూ.1,320 కోట్లు

అద్దె గ‌దుల ధ‌ర పెంపుకు కూడా ఒక ప‌ద్ధ‌తి ఉంటుంది. కానీ, ఒకేసారి 1100శాతం పెంచ‌డం దారుణం. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంను వ్యాపార‌, వాణిజ్య కేంద్రంగా ప్ర‌భుత్వ మార్చేస్తోంది. ఆదాయం పెంచే క్ర‌మంలో ఆర్జిత సేవ‌ల ధ‌ర‌ల‌ను ఇటీవ‌ల వేలంపాట మాదిరిగా క‌మిటీలో నిర్ణయించారు. ఆ త‌రువాత తిరుప‌తి ల‌డ్డూ, ప్ర‌సాదాల ధ‌ర‌ల‌ను పెంచేశారు. ఇప్పుడు ప్ర‌పంచం ఏ వ్యాపార సంస్థ‌, ధార్మిక సంస్థ పెంచ‌ని విధంగా 1100శాతం గ‌దుల అద్దెల‌ను పెంచ‌డం భ‌క్తుల‌కు ఆగ్ర‌హం క‌లిగిస్తోంది. ఈ పెంపు వెనుక ఉన్న అన్య‌మ‌త కుట్ర కోణాన్ని బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నం బీజేపీ చేస్తోంది. అదే బాట‌న విప‌క్షాలు కూడా ఉండ‌డం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి హిందూ స‌మాజంలో ఒక బ్లాక్ స్పాట్ గా మారే అవ‌కాశం ఉంది.