భారీగా పడిపోయాయి టమాటా ధరలు

Tomato Prices ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి టమాటా ధరలు భారీగా పడిపోయాయి. పంటను మార్కెట్‌లకు తీసుకొచ్చిన రైతులు ధరలు పతనం కావడంతో ఆందోళనలో ఉన్నారు. కనీసం కోత, రవాణా ఖర్చులకు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు టమాటా కోతను వాయిదా వేశారు. రాష్ట్రంలోని మార్కెట్‌లలో మరీ దారుణంగా కేజీ టమాటా ధర రూ.5 నుంచి రూ.10లోపే ఉందని చెబుతున్నారు రైతులు. చాయ్ కంటే చీప్.. కేజీ రూ.10లోపే.. ఇది ఏపీలో టమాటా సాగు చేసిన […]

Published By: HashtagU Telugu Desk
Tomato Prices Rise

Tomato Prices Rise

Tomato Prices ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి టమాటా ధరలు భారీగా పడిపోయాయి. పంటను మార్కెట్‌లకు తీసుకొచ్చిన రైతులు ధరలు పతనం కావడంతో ఆందోళనలో ఉన్నారు. కనీసం కోత, రవాణా ఖర్చులకు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు టమాటా కోతను వాయిదా వేశారు. రాష్ట్రంలోని మార్కెట్‌లలో మరీ దారుణంగా కేజీ టమాటా ధర రూ.5 నుంచి రూ.10లోపే ఉందని చెబుతున్నారు రైతులు.

చాయ్ కంటే చీప్.. కేజీ రూ.10లోపే.. ఇది ఏపీలో టమాటా సాగు చేసిన రైతుల పరిస్థితి. గతేడాది కొన్ని నెలల పాటూ సిరులకు కురిపించి టమాటా ధరలు.. ఇప్పుడు మాత్రం దారుణంగా పడిపోయాయి. మార్కెట్‌లలో కేజీ టమాటా ధర రూ.5 నుంచి రూ.10లోపే ఉంది. ఈ ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టమాటా కోత, రవాణా చేసినందుకు అయ్యే ఖర్చు కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను మార్కెట్‌కు తరలించినా ఉపయోగం లేకుండా పోతోంది అంటున్నారు. ఒక్కసారిగా ధరల పడిపోవడంతో ఆందోళనలో ఉన్నారు. అయితే జనాలు మాత్రం టమాటా ధరలు తగ్గిపోవడంతో పండగ చేసుకుంటున్నారు.

జనవరి మొదటి వారంలో టమాటాలు కేజీ రూ.10 నుంచి రూ.20 మధ్య పలికాయి. ఇప్పుడేమో దారుణంగా కేజీ రూ.5 నుంచి రూ.10 మధ్య పలుకుతున్నాయి. అయితే వ్యాపారులు రిటైల్‌గా కేజీ రూ.15 నుంచి రూ.20కు టమాటాను విక్రయిస్తున్నారు. కానీ దారుణంగా రైతుల నుంచి మాత్రం తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. టమాటా పంట నాణ్యత సరిగా లేకపోవడంతోనే ధరలు తగ్గాయంటున్నారు వ్యాపారులు. మార్కెట్‌కు వస్తున్న సరుకు మొదట్లో వచ్చినంత నాణ్యత లేదని.. అందుకే తిరస్కరిస్తున్నట్లు చెబుతున్నారు. రైతులు మాత్రం వ్యాపారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో మార్కెట్లకు వచ్చే టమాటా పంట కూడా తగ్గింది అంటున్నారు. టమాటా ధరలు దారుణంగా పడిపోవడంతో చాలామంది రైతులు కాయల్ని కోసే సాహసం చేయడం లేదు. ఇటీవల టమాటా సాగు చేసిన రైతులది కూడా ఇదే పరిస్థితి. టమాటా సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టామని.. ఇప్పుడు ధరలు తగ్గడంతో కనీసం ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదంటున్నారు. చాలామంది రైతులు అప్పులబారిన పడుతున్నారట. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులకు గిట్టుబాటు ధరల దక్కేలా న్యాయం చేయాలని కోరుతున్నారు. కొందరు రైతులు మాత్రం ధరలను చూసి పొరుగు జిల్లాల్లో మార్కెట్‌లకు తరలిస్తున్నారట. అక్కడైనా సరైన దొరకుతుందనే ఆశతో ఇలా చేస్తున్నారట. మొత్తానికి టమాటా ధరలు తగ్గడంతో రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు.

 

 

  Last Updated: 02 Feb 2026, 12:25 PM IST