Tirumala Forest : జ‌గ‌న్ మెడ‌కు స్మ‌గ్లింగ్ `చిరుత‌`లు

Tirumala Forest : తిరుమ‌ల తిరుప‌తి ఘాట్ రోడ్డులో చిరుతల సంచారం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మెడ‌కు చుట్టుకుంటోంది.

  • Written By:
  • Publish Date - August 17, 2023 / 04:53 PM IST

Tirumala Forest : తిరుమ‌ల తిరుప‌తి ఘాట్ రోడ్డులో చిరుతల సంచారం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మెడ‌కు చుట్టుకుంటోంది. ఆ పార్టీ చేసే స్మ‌గ్లింగ్ వైపు మ‌ళ్లింది. క్రిస్టియ‌న్ల‌కు చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను అప్ప‌గిస్తే చిరుత‌లు వ‌స్తాయంటూ కామెంట్లు చేసిన సోష‌ల్ మీడియా నెటిజ‌న్లు ఇప్ప‌డు శేషాచ‌లం (Tirumala Forest) అడవుల న‌రికేత‌ను లేవ‌నెత్తుతున్నారు. పుండు ఒక‌చోటు ఉంటే మందు మ‌రొక‌చోట వేస్తే లాభంలేద‌ని ట్రోల్స్ చేస్తున్నారు.

శేషాచ‌లం  అడవుల న‌రికేత‌ను(Tirumala Forest)

వాస్తవంగా శేషాచ‌లం అడ‌వులు (Tirumala Forest) ద‌ట్ట‌గా ఉండేవి. అక్క‌డి వృక్షాల‌ను న‌రికివేస్తే క‌ల‌ప‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్నారు. అడ‌వుల్లోని ఎర్ర‌చంద‌నం స్మంగ్లింగ్ ను ఆప‌లేని ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వాలు ఉన్నాయి. అప్ప‌ట్లో చంద్ర‌బాబు సీఎం గా ఉండగా శేషాచ‌లం అడ‌వుల్లో స్మ‌గ్ల‌ర్ల‌ను ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఆ సంద‌ర్భంగా ఎన్ కౌంట‌ర్ చోటుచేసుకుంది. త‌మిళ‌నాడుకు చెందిన కూలీలు ప‌లువురు పోలీస్ తూటాల‌కు బ‌ల‌య్యారు. స్మ‌గ్లింగ్ ల‌ను ఆప‌డానికి జ‌రిగిన అతి పెద్ద ఆప‌రేష‌న్ గా దాన్ని భావించారు. ఆ స‌మ‌యంలోనే ఎర్ర గంగిరెడ్డి పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది.

తిరుమ‌ల అడ‌వుల్లో భారీగా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్

ఎర్ర‌చంద‌నం స్మంగ్లింగ్ కేసులో ఎర్ర గంగిరెడ్డి జైలుకు వెళ్లారు. కానీ, స్మ‌గ్లింగ్ మాత్రం ఆగ‌లేదు. ఆ ముఠా వెనుక ఫ్యానిస్ట్ ల టీమ్ ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపించింది. అప్ప‌ట్లో కొంద‌రు వైసీపీ లీడ‌ర్ల ప్రమేయాన్ని టీడీపీ బ‌య‌ట‌కు తీసింది. ప‌లు మార్లు ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ ను అడ్డుకుని విచార‌ణ చేశారు. ప్ర‌తిసారీ క‌డ‌ప జిల్లాకు చెందిన లింకులు బ‌య‌ట‌ప‌డేవని టీడీపీ లీడ‌ర్లు గుర్తు చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కి అనుచ‌రులుగా స్మ‌గ్ల‌ర్లు ఉన్నార‌ని బాహాటంగా అప్ప‌ట్లో టీడీపీ ఆరోప‌ణ‌లు చేసింది. శేషాచ‌లం అడ‌వుల్లోని (Tirumala Forest) ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ తో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నార‌ని ఆరోప‌ర‌ణ‌లను ఎదుర్కొన్నారు. సీఎంగా చంద్ర‌బాబు ఉండ‌గా, స్మ‌గ్ల‌ర్ల మీద త‌ర‌చూ దాడులు జ‌రిగేవి. ప్ర‌భుత్వం మారిపోయిన త‌రువాత దాడులు నామ‌మాత్రంగా ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

 Also Read : Tirumala : శేషాచలం అడవుల్లో సంచరిస్తున్న మ‌రో 30 చిరుత పులులు – డీఎఫ్‌వో శ్రీనివాసులు

శేషాచ‌లం కొండ‌ల్లోని ఎర్ర‌చంద‌నాన్ని స్మ‌గ్ల‌ర్ల అట‌వీశాఖ అధికారులు అప్ప‌ట్లో ప‌ట్టుకున్నారు. దాన్ని సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వేలం ద్వారా విక్ర‌యించారు. అయితే, ఆ త‌రువాత పెద్ద‌గా ఎర్ర‌చంద‌నాన్ని అట‌వీశాఖ అధికారులు ప‌ట్టుకోలేదు. య‌ధేచ్చ‌గా శేషాచ‌లం కొండల్లో  (Tirumala Forest) వృక్షాల‌ను న‌రికివేస్తున్నార‌ని చిరుత‌లు బ‌య‌ట‌కు రావ‌డం ద్వారా బ‌య‌ట‌ప‌డుతోంది. అంతేకాదు, ఏడాది క్రితం శేషాచ‌లం అడ‌వుల్లో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఆ సంద‌ర్భంగా రెండు రోజుల పాటు అట‌వీసంప‌ద కాలిపోయింది. అడ‌వుల్లోని వృక్షాలు పెద్ద ఎత్తున త‌గుల‌బ‌డ్డాయి. హెలికాప్ట‌ర్ల ద్వారా మంట‌ల‌ను ఆర్పే ప్ర‌య‌త్నం జ‌రిగిన‌ప్ప‌టికీ రెండు రోజుల పాటు అడ‌విలోని చాలా ప్రాంతం కాలిపోయింది.

Also Read : Tirumala: టీటీడీ భక్తులకు అలర్ట్.. నడక మార్గంలో మరో 3 చిరుతలు!

తిరుమ‌ల కొండ‌ల్లోని శేషాచ‌లం అడ‌వులు (Seshachalam Forest) వ‌న్య‌మృగాల‌కు నిల‌యం. అడవులు క్ర‌మంగా అంత‌రించిపోవ‌డంతో చిరుత‌లు జ‌నావాసంలోకి వ‌స్తున్నాయి. ఆ విష‌యాన్ని దాచిపెడుతూ కాలిన‌డ‌క‌ను వ‌చ్చే భ‌క్తుల‌కు క‌ర్ర‌లు, ఫెన్సింగ్ , న‌డిచేందుకు స‌మ‌యం కుదించ‌డం త‌దిత‌ర ఏర్పాట్లు చేయ‌డం గ‌మ‌నార్హం. అడవుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేయ‌కుండా ఎన్ని క‌ర్ర‌ల‌ను ఇచ్చిన‌ప్ప‌టికీ ఫ‌లితం శూన్యం. శేషాచ‌లం అడ‌వుల్లోని ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ ప్ర‌స్తావ‌న వ‌స్తే చాలు, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనుచ‌రుల పేర్ల‌ను టీడీపీ తెర‌మీద‌కు తీసుకొస్తోంది. ఇప్ప‌టికైనా వాస్త‌వాలను బ‌య‌ట పెట్టాల‌ని నెటిజ‌న్లు తాజాగా ట్రోల్స్ చేస్తున్నారు. భ‌క్తులను రాకుండా చేయ‌డానికి క్రిస్టియ‌న్లు కుట్ర ప‌న్నుతున్నార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.