Site icon HashtagU Telugu

Hemoglobin D Punjab : పల్నాడులో ‘పంజాబ్‌’ వ్యాధి కలకలం

Hemoglobin D Punjab

Hemoglobin D Punjab

Hemoglobin D Punjab : పల్నాడు జిల్లాలో ఓ కొత్త వ్యాధి బయటపడింది. సాధారణంగా పంజాబ్‌ రాష్ట్రంలో మాత్రమే వ్యాపించే ఓ వ్యాధి ఇప్పుడు పల్నాడులో బయటపడింది. దీంతో స్థానికుల్లో కొంతమేర ఆందోళన మొదలైంది.  ఆ వ్యాధి పేరే.. ‘సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌’.

We’re now on WhatsApp. Click to Join

పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారుల్లో ‘సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌’ వ్యాధిని గుర్తించామని గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌ వెల్లడించారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు శివారు శ్రీరాంపురంతండా నుంచి ఇటీవల ఇద్దరు పిల్లలు రక్తహీనత (ఎనీమియా) సమస్యతో ఈ ఆస్పత్రికి వచ్చారు. వీరికి గుంటూరు వైద్య కళాశాల పాథాలజీ విభాగం డాక్టర్లు రక్తపరీక్షలు నిర్వహించగా.. సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌ అనే వ్యాధి ఉందని వెల్లడైంది. అరుదైన ఈ వ్యాధికి  ఒకే చికిత్స ఉంది. అదేమిటంటే.. ఎముక మజ్జ (మూలకణ) మార్పిడి చేయడం. ఈ ట్రీట్మెంట్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో  అందుబాటులో లేదు. ఒకవేళ తాత్కాలికంగా ట్రీట్మెంట్ చేయాలంటే.. దాతల నుంచి రక్తాన్ని సేకరించి, అందులోని ఎర్ర రక్త కణాలను వేరు చేసి పేషెంటుకు ఎక్కించాలి. ఇక సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌ వ్యాధిని  గుర్తించిన ప్రాంతంలోని ఇతర పిల్లలకు కూడా రక్త పరీక్షలు చేయడం మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధి చాపకింద నీరులా  ఇతర పిల్లల్లోనూ వ్యాపిస్తుందేమో అనే ఆందోళనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Also Read :Bedroom Decoration : నవ దంపతులకు బెడ్‌రూం.. ఇలా ఉండాలి

Also Read :Womens Health 2024 : నేడే ‘ఉమెన్ హెల్త్ డే’.. గొప్ప లక్ష్యం కోసం ముందడుగు