Roja Unstoppable: బాలయ్య పిలిచాడు.. కానీ నేను వెళ్లను!

ఏపీ మినిస్టర్ రోజా (RK Roja) బాలయ్య అన్ స్టాబబుల్ షో పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Roja unstoppable

Roja

నందమూరి నటసింహాం బాలయ్య (Balakrishna) తన అన్ స్టాబబుల్ షోతో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ షో సూపర్ హిట్ కావడంతో హీరోలు, రాజకీయ నాయకులు సైతం బాలయ్యకు షోకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభాస్, పవన్ కళ్యాణ్ సైతం షోలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య షో ఏపీ టూరిజం మినిస్టర్ రోజా (Minister Roja) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ షోలో పాల్గొనాల్సిందిగా బాలకృష్ణ తనను ఆహ్వానించారని, అయితే ఆ సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో కొన్ని సమస్యల కారణంగా షోకు హాజరు కాలేదని చెప్పారు.

తన పార్టీకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో తాను షోకు హాజరు కాలేదని, ఇప్పుడు ఆ షోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పింది రోజా (Minister Roja). ఎన్టీఆర్ ఎంతోమంది కళాకారులకు ఆదర్శమని, అలాంటి షోకు చంద్రబాబు వెళ్లడంతో తనకు ఆసక్తి లేదని అన్నారు. ఎన్టీఆర్ లేకపోతే నందమూరి కుంటంబమే లేదనీ, ఆయన వల్లే కీర్తి ప్రతిష్టలు వచ్చాయన్నారు. బాలయ్య షోలో మహనేత ఎన్టీఆర్ ను అవమానించారని, అబద్దాలను నిజాలుగా ప్రచారం చేశారని, అందుకే తాను ఆ షోకు దూరంగా ఉన్నానని రోజా (Minister Roja) అన్నారు.

చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు

చంద్రబాబు (Chandrababu) పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాలను చంపేస్తున్నారని విమర్శించారు. పేదవాళ్ల ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా? అంటూ మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 29 మందిని పొట్టనబెట్టుకున్నారని అన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని 40 మందిని పొట్టనబెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్… కందుకూరు, గుంటూరు ఘటనలపై ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నా పవన్ కు కనిపించడంలేదా? పవన్ (Pawan Kalyan) తన నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా? అంటూ నిలదీశారు. చంద్రబాబు తప్పుడు మాటలను వినే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరని రోజా స్పష్టం చేశారు.

Also Read: Bhairi Naresh: రిమాండ్ రిపోర్ట్.. నేరం ఒప్పుకున్న భైరీ నరేష్!

  Last Updated: 02 Jan 2023, 04:14 PM IST