Site icon HashtagU Telugu

RIP RGV : జ‌గ‌న్ కు వ‌ర్మ‌, శ్రీరెడ్డి జై! స్లీప‌ర్ సెల్స్ త‌ర‌హాలో సోష‌ల్ సెల్స్ !

RIP RGV

Rgv

సంచ‌ల‌న డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌(RIP RGV) , సోష‌ల్ మీడియా స్టార్ హీరోయిన్ శ్రీరెడ్డి త‌ర‌చూ రాజ‌కీయాల్లోనూ ఎంట్రీ ఇస్తుంటారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఈగ వాల‌కుండా జాగ్ర‌త్తప‌డుతుంటారు. ఆయ‌న చేస్తోన్న `మ‌రో ఛాన్స్` నినాదానికి ప‌దును పెడుతున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న వేళ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌ద్ధ‌తుగా వ‌ర్మ‌, శ్రీరెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా క్యూ క‌ట్టారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు(CBN), జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదివారం భేటీ అయిన త‌రువాత వ‌ర్మ(RIP RGV) చేసిన ట్వీట్లు ఇరు పార్టీల క్యాడ‌ర్ కు ఆగ్ర‌హం క‌లిగిస్తున్నాయి.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌ద్ధ‌తుగా వ‌ర్మ‌, శ్రీరెడ్డి(RIP RGV  )

`కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని తాను ఊహించలేదు. ‘RIP కాపులు, కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు’ అంటూ వర్మ చేసిన ట్వీట్ ఏపీ రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తోంది. ఈ ట్వీట్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు. కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదని వెంకన్న సెటైర్ వేశారు. `RIP రామ్ గోపాల్ వర్మ … కంగ్రాట్స్ జగన్ రెడ్డి` అని ట్వీట్ చేశారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సినీ నటి అషురెడ్డి కాళ్లను నాకిన వ‌ర్మ‌ను ఉద్దేశించే బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘RIP కాపులు , కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు’ అంటూ ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ పై జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Also Read : Janasena: జనసేన భవిష్యత్తుకు చంద్రబాబు బాట..!

గ‌త ఎన్నిక‌ల్లోనూ జ‌న‌సేన పార్టీని, ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియా వేదిక‌గా డ్యామేజ్ చేయ‌గ‌లిగారు. ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఇంట్లో వాళ్ల‌ను కూడా బ‌జారుకు ఈడ్చారు. అప్ప‌ట్లో శ్రీరెడ్డి దెబ్బ‌కు ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగే వ‌ర‌కు ప‌వ‌న్ వెళ్లారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా వ‌ర్మ, శ్రీరెడ్డి సంయుక్తంగా జ‌న‌సేన పార్టీని ఒక ఆట ఆడుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీని 2019 ఎన్నిక‌ల ముందు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్, క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు అంటూ సినిమాల‌ను వ‌ర్మ విడుద‌ల చేశారు. వాటిలోని సారాంశం, క్యారెక్ట‌ర్స్ అన్నీ చంద్రబాబు, లోకేష్ ను వీలున్నంత డ్యామేజ్ చేస్తూ ఉన్నాయ‌ని అంద‌రికీ తెలిసిందే.

Also Read : BRS Meeting : బీఆర్ఎస్ కు కౌంట్ డౌన్! కేసీఆర్ ఖ‌మ్మం స‌భ అల‌జ‌డి!

ఇటీవ‌ల ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసిన వ‌ర్మ ఈసారి `వ్యూహం-1,2` సినిమాలను తీస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబును టార్గెట్ చేస్తూ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల ముందు వ్యూహం పేరుతో రెండు భాగాలుగా సినిమాను విడుద‌ల చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ట‌. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత ఏ విధంగా చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష‌నేత‌గా కుట్ర‌లు ప‌న్నారు? అనే కోణం నుంచి స్క్రీప్ట్ సిద్ధం అవుతుంద‌ని తెలుస్తోంది. గ‌త మూడున్న‌రేళ్లుగా జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను తీసుకుని తెర‌కెక్కించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సినిమా టిక్కెట్ల విష‌యంలోనూ వ‌ర్మ ఇటీవ‌ల జోక్యం చేసుకున్నారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ న‌టించిన బీమ్లానాయ‌క్ సినిమా ప్రీ రిలీజ్, సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యంలో జ‌రిగిన వివాదంలోనూ కీ రోల్ వ‌ర్మ పోషించారు.

Also Read NTR: ఎన్టీఆర్​ ప్రజా పట్టాభిషేకానికి నేటికి 40 ఏళ్లు!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి  అండ‌గా నిలుస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు శ్రీరెడ్డి, వ‌ర్మ రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తుంటారు. అందుకు ప్ర‌తిఫలంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏమి ఇస్తారో తెలియ‌దుగానీ, పేటీఎం బ్యాచ్ అంటూ టీడీపీ చెబుతోంది. స్లీప‌ర్ సెల్స్ గా ప‌నిచేస్తుంటార‌ని విశ్వ‌సిస్తోంది. ఇటీవ‌ల స్లీప‌ర్ సెల్ అనే ప‌దం రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసింది. చంద్ర‌బాబు కందుకూరు, గుంటూరు స‌భ‌ల్లో జ‌రిగిన తొక్కిస‌లాట సంద‌ర్భంగా స్లీప‌ర్ సెల్స్ ప‌నిచేశాయ‌ని టీడీపీ అనుమానిస్తోంది. వ్యూహాత్మ‌కంగా చంద్ర‌బాబు స‌భ‌ల‌ను అడ్డుకోవ‌డానికి స్లీప‌ర్ సెల్స్ ను ఆప‌రేట్ చేసిన‌ట్టు ఆరోపిస్తోంది.

వ‌ర్మ‌, శ్రీరెడ్డి సోష‌ల్ మీడియా స్లీప‌ర్ సెల్స్ గా..

ఫ‌లితంగా జీవో నెంబ‌ర్ 1 తీసుకురావ‌డానికి మార్గాన్ని సుగ‌మ‌మం చేసుకున్నార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద విరుచుకుప‌డుతోంది. ఈ రెండు చోట్ల జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌పై వ‌ర్మ ట్వీట్లు చేయ‌డంతో పాటు ఉద్దేశ‌పూర్వ‌కంగా చంద్ర‌బాబు(CBN) తొక్కిస‌లాట‌కు ప్రేరేపించార‌ని వ్యంగ్యాస్త్రాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా సంధించారు. ఇక శ్రీరెడ్డి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏమి చేసిన‌ప్ప‌టికీ మ‌ద్ధ‌తు ప‌లుకుతూ కోసేస్తా..పొడిచేస్తా..అంటూ త‌న‌దైన పంథాలో ప్ర‌త్య‌ర్థుల‌కు మాట‌ల‌తో తూటాల‌ను పేల్చుతుంటారు. మొత్తం మీద వ‌ర్మ‌, శ్రీరెడ్డి కాంబినేష‌న్ కూడా సోష‌ల్ మీడియా స్లీప‌ర్ సెల్స్ గా పనిచేస్తుందా? అంటే ఔనంటున్నారు టీడీపీ, జ‌న‌సేన క్యాడ‌ర్.

Also Read : RGV with Ashu Reddy: దటీజ్ వర్మ.. ఆశురెడ్డి కాళ్లకు ముద్దు పెట్టి, మసాజ్ చేసి!