Site icon HashtagU Telugu

CBN-Pawan : ప్రముఖ గ్రంథాలఫై చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ల ఫొటోస్..

Pawan Cbn Photos

Pawan Cbn Photos

ఏపీలో కూటమిని ఏర్పాటు చేసి..ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు అరుదైన గౌరవం దక్కబోతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ‘జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం’ సంస్థాపక కార్యదర్శి, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘జయ జయోస్తు’, ‘నారసింహో.. ఉగ్రసింహో’ గ్రంథాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ఫొటోలు ముద్రించబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రానికి చంద్రబాబు సమర్థవంతమైన పాలన అందించాలని కోరుకుంటూ కిమ్స్ ఆసుపత్రి చైర్మన్, మాజీ శాసనసభ్యుడు బొల్లినేని కృష్ణయ్య పైన పేర్కొన్న రెండు మహత్తర గ్రంథాలను బెజవాడ కనకదుర్గమ్మ చెంతన ఉంచి, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుతో ఆవిష్కరింపజేశారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, బీజేపీ, టీడీపీ, జనసేన ముఖ్యనేతలు ఈ రెండు గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం 25 వేల ప్రతులు సిద్ధం చేస్తున్నారు. అలాగే, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలోనూ వీటిని ఉచితంగా పంపిణీ చేసేందుకు టీడీపీ శ్రేణులు ముందుకొచ్చాయి.

Read Also : Minister Kandula Durgesh : మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన మంత్రి కందుల దుర్గేష్