YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో శనివారం ఘనంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా APSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) కె.ఎస్. బ్రహ్మానంద రెడ్డి హాజ‌రైయ్యారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద అని ఆయ‌న పేర్కొన్నారు. ఉద్యోగులు నిత్యం యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ […]

Published By: HashtagU Telugu Desk
APSRTC YOGA DAY

APSRTC YOGA DAY

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో శనివారం ఘనంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా APSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) కె.ఎస్. బ్రహ్మానంద రెడ్డి హాజ‌రైయ్యారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద అని ఆయ‌న పేర్కొన్నారు. ఉద్యోగులు నిత్యం యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) గద్దె నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్యమే సంస్థకు నిజమైన బలం అని అన్నారు. యోగా ద్వారా ఒత్తిడి తగ్గి, పనితీరు మెరుగుపడటంతో పాటు జీవితంలో సానుకూల దృక్పథం పెరుగుతుందని వివరించారు.

ఈ సందర్భంగా ప్రముఖ యోగా గురువు వి.కె.వి.కె. కళాధరరావు ఆధ్వర్యంలో యోగా ప్రదర్శనలు నిర్వహించారు. పాల్గొన్న అధికారులు, ఉద్యోగులకు వివిధ యోగా ఆసనాలు, శ్వాస వ్యాయామాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమం అనంతరం యోగా గురువు కళాధరరావును నగదు పురస్కారం, ప్రశంసాపత్రం, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  Last Updated: 21 Jun 2026, 11:39 AM IST