Pawan Kalyan 4th Wife : నా నాల్గో భార్య జగన్ ఏమో – పవన్ కళ్యాణ్ మాములు సెటైర్ కాదు..!!

బుధువారం తాడేపల్లి గూడెం లో జరిగిన టీడీపీ – జనసేన ఉమ్మడి ‘జెండా’ సభ (Janasena TDP ‘Jenda’ Public Meeting)లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ డైలుగులే..ఓ రేంజ్ పంచ్ లు కూడా వేసి జగన్ ఫై తన కసిని తీర్చుకున్నాడు. తన పెళ్లిళ్లపై వైసీపీ చేస్తున్న విమర్శలపై తనదైన కౌంటర్ ఇచ్చాడు. ‘పవన్ అంటే మూడు పెళ్లిళ్లు (Pawan Kalyan 3 Marriages). రెండు విడాకులు అని పదే పదే […]

Published By: HashtagU Telugu Desk
Jagan 4th Wife

Jagan 4th Wife

బుధువారం తాడేపల్లి గూడెం లో జరిగిన టీడీపీ – జనసేన ఉమ్మడి ‘జెండా’ సభ (Janasena TDP ‘Jenda’ Public Meeting)లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ డైలుగులే..ఓ రేంజ్ పంచ్ లు కూడా వేసి జగన్ ఫై తన కసిని తీర్చుకున్నాడు. తన పెళ్లిళ్లపై వైసీపీ చేస్తున్న విమర్శలపై తనదైన కౌంటర్ ఇచ్చాడు. ‘పవన్ అంటే మూడు పెళ్లిళ్లు (Pawan Kalyan 3 Marriages). రెండు విడాకులు అని పదే పదే అంటారు. జగన్ (Jagan) అయితే నాలుగు పెళ్లిళ్లు అంటాడు. మరి ఆ నాలుగో భార్య జగన్ (Pawan Kalyan 4th Wife Jagan) ఏమో నాకు తెలీదు’ అంటూ ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. ఈ డైలాగ్ కు వేదిక ఫై ఉన్న నేతలే కాదు సభకు వచ్చిన కార్యకర్తలు , అభిమానులు ఓ రేంజ్ లో నవ్వులు చిందించారు. అంతే కాదు ఈ కార్యక్రమం చూస్తున్న అభిమానులు కూడా అన్న ఏమన్నా వేసావా..అంటూ మాట్లాడుకోవడం , కామెంట్స్ చేయడం చేసారు.

‘జగన్ భార్యను భారతి గారు అంటూ మర్యాదిస్తాం. కానీ చంద్రబాబు, నా విషయంలో పెళ్లాలు అంటూ జగన్ సంబోధిస్తాడు. అదే మాట మిమ్మల్ని అంటే ఏమంటారు భారతి గారు’ అంటూ వేదిక మీదనుండి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక చంద్రబాబును 53 రోజులు జైలులో పెట్టడం తనను బాధించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘ఆయన భార్యను అనకూడని మాటలు అంటే బాధ కలిగింది. తన కుమార్తె చనిపోయిందని సుగాలి ప్రీతి తల్లి చెబితే.. 2 చోట్ల ఓడి కూర్చున్న నాకు నిస్సహాయతగా అనిపించిందని పవన్ చెప్పుకొచ్చారు.

‘సొంత బాబాయ్ ని చంపించాడు. సొంత చెల్లెల్ని గోడకేసి కొట్టాడు. వీళ్లా నాకు సలహాలు ఇచ్చేది’ అంటూ మండిపడ్డారు. ‘అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మనకు వేల కోట్లు డబ్బులున్నాయా? టీడీపీలా బలమైన సంస్థాగత వ్యవస్థ ఉందా? ఇప్పుడిప్పుడే జనసేన ఇళ్లు కడుతున్నాం. కోట కూడా కడతాం. తాడేపల్లి కోట కూడా కూలగొడతాం’ అని భారీ డైలాగ్ పేల్చారు. ఓటుకు రూ.5000 ఇస్తాం..రూ. 500 ఇస్తాం అంటారే కానీ…ఎప్పుడైనా ఉద్యోగాలు ఇస్తానని జగన్ ఏనాడైనా చెప్పాడా..? అని ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక జనసేనకు 24 సీట్లు కేటాయించడం ఫై కూడా పవన్ క్లారిటీ ఇచ్చారు. ‘నా వ్యూహాన్ని తప్పుబట్టకండి. ప్రజా క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం నాది. పదేళ్లుగా అవమానాలు ఎదుర్కొన్న నన్ను మనవాళ్లు ప్రశ్నిస్తున్నారు. నేనేం సంపాదించానని నన్ను ప్రశ్నిస్తున్నారు. నిజంగా మీరు నా మద్దతుదారులైతే నన్ను ప్రశ్నించకండి. నా వెంట నడవండి. నన్ను ప్రశ్నించడం కాదు.. నాతో కలిసి యుద్ధం చేయండి’ అని పిలుపునిచ్చారు.

జగన్ ఫామ్ హౌస్ లో ఏంచేసేవాడో నాకు తెలుసంటూ పవన్ చెప్పుకొచ్చారు. ‘నేను ఒక్కడినే అంటూ జగన్ ఊదరగొడుతున్నారు. జనసేనకున్న ఒక్క ఎమ్మెల్యేని లాక్కెళ్లిన నువ్వా ఒక్కడివి? నా వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారు. జగన్ జూబ్లీహిల్స్ ఫామ్ హౌస్లో ఏం చేసేవాడో నాకు తెలుసు. నీ వ్యక్తిగత జీవితం గురించి నా దగ్గర టన్నుల ఇన్ఫర్మేషన్ ఉంది జగన్’ అంటూ ఫైర్ అయ్యారు.

Read Also : AP : టీడీపీ, జనసేన సూపర్ హిట్.. వైసీపీ అట్టర్ ఫ్లాప్ – చంద్రబాబు

  Last Updated: 28 Feb 2024, 10:23 PM IST