Site icon HashtagU Telugu

Nara Lokesh Red Book : కాస్కోండ్రా..అంటున్న నారా లోకేష్..వైసీపీ నేతలకు చుక్కలే..!!

Reb Book

Reb Book

అధికార మదంతో వైసీపీ నేతలు ఐదేళ్ల పాటు ఎన్ని అరాచకాలు..ఎన్ని దౌర్జన్యాలు..ఎన్ని హత్యలు..ఎన్ని అక్రమ కేసులు పెట్టారో తెలియంది కాదు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ను సైతం జైల్లో పెట్టించారు..పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో , నేతను రోడ్ల మీదకు వచ్చి నిరసన చేసేలా చేసారు. ఇక టీడీపీ, జనసేన శ్రేణులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేదించారో తెలియంది కాదు..సోషల్ మీడియా వేదికగా కూడా ఎన్ని బూతులు అన్నారో..అనిపించారో కూడా తెలియంది కాదు. ఇన్ని చేసిన వీరిని నారా లోకేష్ బదులు తీర్చుకోకుండా ఉంటాడా..? అందరి లెక్క సరిచేసి..ఎలాంటి శిక్షలు వేయాలో..ఏ రేంజ్ లో వేయాలో అన్ని సిద్ధం చేసాడు. వైసీపీ నేతల పాపాలన్నిటిని రెడ్ బుక్ లో రాసుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ బుక్ ఓపెన్ చేసే టైం వచ్చేసింది. బుక్ లో మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయో, ఎవరెవరి పేర్లు ఉన్నాయో కానీ, ఇప్పుడు తెరిచిన పేజీ ఇదేనంటూ రాజకీయాల్లో జోరుగా చర్చ మొదలై..వైసీపీ నేతలకు చెమటలు పట్టిస్తుంది.

ప్రస్తుతం ఏపీలో రాత్రివేళ పెద్ద ఎత్తున పోలీసులు సైరన్ తో వైసీపీ నేతలకు , శ్రేణులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎవర్ని అరెస్ట్ చేస్తున్నారో..పోలీసులు వచ్చేది తమ ఇంటికేనేమో అంటూ వారంతా భయపడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతల అరెస్ట్ వెనుక రెడ్ బుక్ ఓపెన్ చేయడమే అంటున్నారు. రెడ్ బుక్ లో ఉన్న పేర్లను బట్టి వరుసపెట్టి వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారట.

ఇలా రెడ్ బుక్ ఫస్ట్ పేజీ ఓపెన్ కాగా, నెక్స్ట్ పేజీ వారిదే అనే రీతిలో ఇటీవల వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ ఒక్కొక్కరిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అది కూడా హద్దులు దాటి ట్రోలింగ్స్ చేసిన బ్యాచ్ భరతం పడుతున్నారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ టీడీపీ సోషల్ మీడియా సమర్ధించుకుంటోంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మాట్లాడుతూ.. ఒకడు నన్ను చంపుతానని అన్నాడు.. మరొకడు నా పిల్లలను ట్రోలింగ్ చేశాడు.. ఇంకొకడు నేరుగా సీఎంనే చంపుతానన్నాడు.. ఎవరిని వదిలిపెట్టొద్దు. పోలీసులూ.. మీ డ్యూటీ మీరు చేయండి అంటూ హెచ్చరించారు. ఇదంతా రెడ్ బుక్ మహిమే అంటున్నారు. ఏది ఏమైనప్పటికి అధికార మదం తో విర్రవీగిన వైసీపీ నేతలు ఇప్పుడు ఊసలు లెక్కబెట్టేందుకు సిద్ధమయ్యారు.

Read Also : Raihan Vadra Gandhi : రాజకీయాల్లోకి రైహాన్ వాద్రా గాంధీ..? మేనమామ దగ్గరుండి నేర్పిస్తున్నాడా..?