Site icon HashtagU Telugu

Mega Politics : పిచ్చుక ఫినిష్‌!సాయిపై`భోళా`శంఖం!!

Mega Politics

Mega Politics

ఏపీ రాజ‌కీయాల్లో భోళాశంక‌ర్  (Mega Politics) దొరికిపోయారు. ఆయ‌న చేసిన `పిచ్చుక మీద బ్ర‌హ్మాస్త్రం` కామెంట్ ఢిల్లీ దిశ‌గా వెళ్లింది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు కాద‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల రాజ్య‌స‌భ వేదిక‌గా హీరోల పారితోష‌కం మీద ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఇచ్చిన స్పీచ్ ను టార్గెట్ చేసిన‌ట్టు కొత్త వ‌ర్ష‌న్ మెగా కోట‌రీ నుంచి వ‌స్తోంది. వాల్తేరు వీర‌య్య 200 వ రోజు ఫంక్ష‌న్లో చిరంజీవి చేసిన వ్యాఖ్య‌ల వేడి ఇంకా త‌గ్గ‌లేదు. దాని సెగ భోళాశంక‌ర్ కు తగిలింది. ఈనెల 11వ తేదీన విడుద‌ల‌య్యే భోళాశంక‌ర్ సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి ఆ సినిమా నిర్మాత ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. కానీ, 20 ర‌కాల డాక్యుమెంట్ల‌ను అందించ‌లేక‌పోతున్నారు.

ఏపీ రాజ‌కీయాల్లో భోళాశంక‌ర్  (Mega Politics)

వాస్త‌వంగా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ వ‌ల‌న ఏపీ రాష్ట్రానికి ఏ మాత్రం ఉప‌యోగం లేదు. ఆ రాష్ట్రం నుంచి వినోదం రూపంలో డ‌బ్బు దండుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల‌ను పెంచుకుంటున్నారు. నైజాం, సీడెడ్, ఆంధ్రా అంటూ సినిమా షేర్ల‌ను లెక్కిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం నైజాం కింద‌కు వ‌స్తోంది. ఆ ప్రాంతం నుంచి వ‌చ్చే షేర్ చాలా త‌క్కువ‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో మ‌ల్టీప్లెక్స్ లు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ సీడెడ్, ఆంధ్రా కంటే కంటే వ‌సూళ్లు త‌క్కువ. 70శాతం వ‌సూళ్లు సీడెడ్, ఆంధ్రా నుంచి వ‌స్తాయి. అయిన‌ప్ప‌టికీ ఏపీ రాష్ట్రం గురించి సినిమా హీరోలు ఎవ‌రూ ప‌ట్టించుకోరు. క‌నీసం సినిమా ఇండ‌స్ట్రీని  (Mega Politics)ఆ రాష్ట్రానికి త‌ర‌లిద్దామ‌న్న ఆలోచ‌న కూడా చేయ‌రు.

ఏపీ రాష్ట్రం గురించి సినిమా హీరోలు ఎవ‌రూ ప‌ట్టించుకోరు

ఒకానొక సంద‌ర్భంలో ఏపీ రాష్ట్రానికి ఫిల్మ్ ఇండ‌స్ట్రీ రావాల‌ని కొంద‌రు ఉద్య‌మించారు. అందుకు మ‌ద్ధ‌తు ఇవ్వ‌ని హీరోల సినిమాల‌ను బ్యాన్ చేయాల‌ని కూడా పిలుపునిచ్చారు. కానీ, అప్ప‌ట్లో టీడీపీ అధికారంలో ఉండ‌డంతో ఆ ఉద్య‌మం పెద్ద‌గా క్లిక్ కాలేదు. ఆ త‌రువాత 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయ్యారు. ఆయ‌న‌కు క‌నీసం శుభాకాంక్ష‌లు తెల‌ప‌డానికి కూడా సినీ పెద్ద‌లు కొన్ని నెల‌ల పాటు వెళ్ల‌లేదు. ఇదే అంశంపై మీడియాలో పెద్ద ఎత్తున న్యూస్ రావ‌డంతో కొంద‌రు పెద్ద‌లు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కలిసి అభినంద‌న‌లు తెలిపారు. ఆ సంద‌ర్భంగా స్టూడియోల‌ను ఏపీలో పెట్టాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోరారు. షూటింగ్ ల‌ను రాష్ట్రంలో నిర్మించాల‌ని సూచించారు. రాయితీల‌ను కూడా ప్ర‌క‌టించారు. కానీ, ఆ రాష్ట్రం వైపు చూసిన సినిమా పెద్ద‌లు లేరు. కానీ, ఏపీ ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున సినిమా(Mega Politics) క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతున్నారు.

సినిమా నియంత్ర‌ణ బిల్లు చ‌ర్చ‌కు విజ‌య‌సాయిరెడ్డి

తెలంగాణ‌లో పుట్ట‌లేద‌ని బాధ‌ప‌డుతున్నాన‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ ఒకానొక సంద‌ర్భంలో అన్నారు. అంతేకాదు, ఆ రాష్ట్రం ఏమి జ‌రుగుతుందో త‌మ‌కు సంబంధంలేద‌ని కొంద‌రు సినీ పెద్ద‌లు వ్యాఖ్యానించారు. ఇలాంటి ప‌రిస్థితి ఉండ‌గా, టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి అనుమ‌తుల‌కు మాత్రం ముందుంటారు. కాదంటే, పిచ్చిక మీద బ్ర‌హ్మాస్త్ర‌మా అంటూ వ్యాఖ్య‌లు చేస్తుంటారు. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సినిమా ఇండ‌స్ట్రీ మీద ఆచితూచి అడుగులేస్తున్నారు. ఒక వైపు జ‌న‌సేనాని ప‌వ‌న్ గంట‌కు రూ.2కోట్లు తీసుకుంటాన‌ని చెబుతున్నారు. ఆయ‌న కంటే ఎక్కువ‌గా ప్ర‌భాస్, జూనియ‌ర్, రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబు పారిదోష‌కం తీసుకుంటున్నారు. ఫ‌లితంగా సినిమాల నాణ్య‌త త‌గ్గ‌డం, అంచ‌నాకు మించి బ‌డ్జెట్ పెరిగిపోతోంది. దీంతో సినీ ప‌రిశ్ర‌మ న‌ష్టాల‌పాల‌వుతుంద‌ని కేంద్రం భావించింది. అందుకే నియంత్ర‌ణ బిల్లు (Mega Politics)  తేవాల‌ని చ‌ర్చ‌కు పెట్టింది.

Also Read : Chiranjeevi : గుడివాడలో కొడాలి నానికి వ్యతిరేకంగా చిరంజీవి ఫ్యాన్స్ ఆందోళన

సినిమా నియంత్ర‌ణ బిల్లు మీద రాజ్యస‌భ‌లో ఇటీవ‌ల విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడారు. హీరోల పారితోష‌కంతో ప‌రిశ్ర‌మ న‌ష్ట‌పోతుంద‌ని ప్ర‌సంగించారు. నియంత్ర‌ణ అక్క‌డ చేయాల‌ని సూచించారు. సినిమా నిర్మాణం కంటే హీరోల పారితోష‌కం ఎక్కువ‌గా ఉంద‌ని తెలియ‌చేస్తే, మ‌నీ ల్యాండ‌రింగ్ అంశాన్ని కూడా తెర‌మీద‌కు తీసుకొచ్చారు. ఇటీవ‌ల ప‌వ‌న్ హీరోగా న‌టించిన బ్రో సినిమా మీద మ‌నీ ల్యాండ‌రింగ్ కేసు పెట్ట‌డానికి మంత్రి అంబ‌టి ఢిల్లీ వెళ్లారు. యాదృశ్చికంగా అదే స‌మ‌యంలో సినిమా నియంత్ర‌ణ బిల్లు చ‌ర్చ‌కు వ‌చ్చింది. దాని మీద విజ‌య‌సాయిరెడ్డి (Mega Politics)మాట్లాడిన అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని `పిచ్చుక మీద బ్ర‌హ్మాస్త్రం` వ్యాఖ్య‌ల‌ను చిరంజీవి చేసిన‌ట్టు తాజాగా వెలుగుచూసింది. ఆ వ్యాఖ్య‌లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌మ‌న్న‌ట్టు ఫోక‌స్ అయ్యాయి.

Also Read : Chiranjeevi : భోళా శంకర్ కు షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్..?

జ‌న‌సేన వైపు వెళ్ల‌డానికి చిరంజీవి మార్గం సుగ‌మ‌మం చేసుకుంటున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ, అపోలో కుటుంబంతో స‌న్నిహితంగా ఉన్న వైఎస్ కుటుంబాన్ని కాద‌ని చిరంజీవి ఒక్క అడుగు కూడా వేసే ప‌రిస్థితి లేద‌ని మెగా కోట‌రీలోని టాక్‌. కోడ‌లు ఉపాస‌న మెగా కోట‌లోని కీ రోల్ . ఆ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే, మెగాస్టార్ జ‌న‌సేన వైపు వెళ్లే ప్ర‌స‌క్తేలేదు. కేవ‌లం ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పీచ్ కి కౌంట‌ర్ మాత్ర‌మే `పిచ్చుక‌పై బ్ర‌హ్మాస్త్రం` వ్యాఖ్య‌లని క్లారిటీ వ‌చ్చేస్తోంది.