Polavaram: పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని మహారాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు శనివారం సందర్శించారు. ఈ మేరకు వారు పోలవరం ప్రాజెక్ట్‌లో స్పిల్ వే, స్పిల్ వే గేట్లు, ఫిష్ లేడర్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతం, పోలవరం జల విద్యుత్తు కేంద్రాన్ని పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, దాని నిర్మాణానికి ఉపయోగించే యంత్రాలు, మెటీరియల్ వివరాలను స్థానిక జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించారు. అక్కడి పంప్ హౌస్, ఫోర్ బేలను పరిశీలించారు.
Read Also: Jagan : జగన్ తో నడిచినందుకు జైలుకు వెళ్లాల్సిందేనా..?
పోలవరం ప్రాజెక్ట్ ను మహారాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి సంజయ్ బెల్సారే, గోదావరి నది నిర్వహణ ఔరంగాబాద్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ తీర్మన్వర్, జలవనరుల విభాగం పుణె చీఫ్ ఇంజినీర్ హనుమంత్ గుణాలే, సీడీఓ నాసిక్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఆశీష్ డియోగడే పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమలను సందర్శించారు. కాగా, జగన్ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును విస్మరించారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలో వచ్చాక పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజి కింద మరో రూ. 6,270 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
2014-19 కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే పోలవరం పనులు 72 శాతం పూర్తికాగా.. నిర్వాసితులకు రూ. 6వేల కోట్లు అందించారు. 2019-24 మధ్య సహాయపునరావాసాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కేంద్రం నిధులు ఇస్తేనే మీకు ఇస్తానంటూ జగన్ నిర్వాసితుల సమక్షంలోనే చేతులెత్తేసారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజి కింద మరో రూ. 6,270 కోట్లు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుండగా కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయి చెల్లింపులు జరపడంపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తుంటుంది.
కాగా, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 70% పూర్తయింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ప్రకారం, 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు పూర్తి అయితే 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 28.5 లక్షల మందికి తాగునీరు మరియు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. మహారాష్ట్ర అధికారులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే రాష్ట్రానికి సాగునీరు, విద్యుత్ మరియు తాగునీరు వంటి వనరులు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. ఈ సందర్శన ద్వారా మహారాష్ట్ర అధికారులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి, ఇతర రాష్ట్రాలతో సమన్వయాన్ని మెరుగుపరచడానికి, మరియు ప్రాజెక్టు ప్రయోజనాలను సమర్థవంతంగా ఉపయోగించడానికి కృషి చేయాలని సంకల్పించారు.
Read Also: Telangana : ఫ్యాన్సీ నంబర్లతో ఒక్క రోజే రూ.3.71 కోట్ల ఆదాయం