సినీ నటుడు , జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హత్య కు భారీ కుట్ర జరుగుతున్నట్లు వార్తలు ఇప్పుడు మెగా ఫ్యామిలీ తో పాటు అభిమానుల్లో , ప్రజల్లో ఆందోళన పెంచుతుంది. పవన్ కళ్యాణ్ హత్య కు కుట్ర చేస్తున్న విషయం నేరుగా కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించడంతో అంత భయబ్రాంతులకు గురి అవుతూ..పవన్ కళ్యాణ్ కు జాగ్రత్త చెపుతున్నారు.
కేంద్ర నిఘా వర్గాల (Central Intelligence ) నుంచి అందిన సమాచారం ప్రకారం.. ‘‘గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు.. మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పూర్తి వివరాలు వెల్లడించలేం. కానీ జాగ్రత్తగా ఉండాలి’’ అని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్ ట్రాకింగ్ లో కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్లుగా పేర్కొన్నారు. అయితే.. ఆ గ్రూపులు ఎవరివి? అన్న దానిపై విశ్లేషణ చేసినప్పుడు పవన్ ను హత్య చేసేందుకు కుట్ర జరగొచ్చన్న అభిప్రాయం కలిగేలా పరిణామాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అంటే ఓ సాధారణ వ్యక్తి కాదు..ఓ తుఫాన్ అని ప్రధాని మోడీనే తెలుపడం తో పవన్ క్రేజ్ ఏదో అందరికి అర్థమైంది. ఈరోజు ఏపీలో కూటమి అధికారంలో ఉందంటే అది పవన్ కళ్యాణ్ వల్లే అని చిన్నపిల్లాడి దగ్గరి నుండి పండుముసలాడి వరకు చెపుతారు. తన స్థాయిని తగ్గించుకొని సైతం బిజెపి , టిడిపి ని కలిపి ఈరోజు అధికారంలోకి వచ్చేలా చేసాడు. 175 కు 175 సాధిస్తాం అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ ని కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యేలా చేసాడు. అంతే కాకుండా ఇప్పుడు డిప్యూటీ సీఎం గానే కాక కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ..రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. అలాగే గడిచిన ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై ఫోకస్ చేసి…అక్రమాలకు పాల్పడిన వారిని బయటకు తీసుకొస్తూ కేసులు పెడుతున్నారు. ఇలా అన్ని విషయాల్లో పవన్ తన మార్క్ కనపరుస్తుండడంతో కొంతమందికి మింగుడు పడడం లేదు. పవన్ కళ్యాణ్ ఇలా రోజు రోజుకు తన స్థాయిని పెంచుకుంటూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తుండడంతో..కొంతమందికి ఏమాత్రం మింగుడుపడడంలేదు. పవన్ కళ్యాణ్ ను ఇలా వదిలేస్తే మొదటికే మోసం వస్తుందని కూడా మాట్లాడుకుంటున్నారు.
ఇదే కాదు పవన్ కల్యాణ్ హిందూ ధర్మం ఆచరించటమే కాదు.. అందుకు సంబంధించిన వాటిని.. ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు. మొన్నటి వరకు కూడా వారాహి అమ్మవారి దీక్ష చేసారు. ఇది కూడా కొన్ని వర్గాల వారికి కంటగింపుగా మారిందంటున్నారు. ఇలా ఏ రకంగా చూసిన పవన్ స్థాయి..స్థానం ..హోదా ..గౌరవం భారీగా పెరుగుతూ వచ్చింది. ఇది కూడా కొంతమంది తట్టుకోలేకపోతున్నారు.
ఇక రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ ఓ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 100 % స్ట్రయిక్ రేట్ తో ఎవరు కూడా విజయం సాధించలేదు. కానీ పవన్ ఆ విజయం సాధించుకొని రాజకీయంగా ఓ చరిత్ర సృష్టించాడు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి ప్రజల్లో తనపై ఎంత నమ్మకం ఉందొ రుజువు చేసాడు. ఇలా రాజకీయంగా కూడా తన సత్తా ఏంటో చూపించడంతో పలు పార్టీల నేతల్లోనూ ఈర్ష పెరుగుతుంది. ఇలా అనేక కారణాల కారణంగా పవన్ కు శత్రువులు పెరిగారని చెప్పవచ్చు. మరి వారి నుండి ఏమైనా ప్రాణ హాని ఉందా..? లేక ఇంకెవరైనా హత్య కు ప్లాన్ చేస్తున్నారా..? అనేది స్పష్టంగా తెలియనప్పటికీ..కేంద్రం హెచ్చరిక తో మాత్రం పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో చాల జాగ్రత్తగా ఉండాలని అంత చెపుతున్నారు.
Read Also : Bajaj Freedom 125 CNG: మొదలైన సీఎన్ జీ బైక్ డెలివరీలు.. ధర, ఫీచర్స్ ఇవే?
