Site icon HashtagU Telugu

Jagan war : ప‌వ‌న్ పొత్తుపై జ‌గ‌న్ `ప్యాకేజీ` వార్‌

Human trafficking

Jagan War

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jagan war) అటాక్ చేశారు. ద‌త్త‌పుత్రుడు అంటూ ఇటీవ‌ల ప్ర‌తి వేదిక‌పైనా చెప్పిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్యాకేజి స్టార్(pakage star) అంటూ ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కొంద‌రు ఇలాంటి ఆరోప‌ణ‌ల‌ను చేయ‌డం విన్నాం. ఏకంగా సీఎం నోటి నుంచి ప్యాకేజీ స్టార్ ప‌వ‌న్ అంటూ రావ‌డం గ‌మ‌నార్హం.

ప్యాకేజీ స్టార్ అంటూ ప‌వ‌న్ పై ఏపీ   సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అటాక్(Jagan war) 

చుక్క‌ల భూముల‌కు హ‌క్కులు క‌ల్పించే కార్య‌క్ర‌మానికి నెల్లూరు జిల్లా కావలి స‌భ‌కు వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజా రాజ‌కీయాల‌పై గ‌ళం(Jagan war) విప్పారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద ధ్వ‌జ‌మెత్తారు. ఎప్ప‌టి మాదిరిగా ఎల్లో మీడియా అంటూ మాట్లాడుతూ ఈసారి ఆ మీడియాకు వ‌చ్చే గెస్ట్ ల మీద కూడా గురిపెట్టారు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితిపై చార్టెడ్ అకౌంటెంట్ జీవీ రావు అంటూ ఎవ‌ర్నో ప‌రిచ‌యం చేసి, ఆయ‌న చేత అబ‌ద్దాలు చెప్పిస్తున్నార‌ని దుయ్య‌బట్టారు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే, రాబోవు రోజుల్లో సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆపివేయ‌డానికి కుట్ర చేస్తున్నార‌ని అన్నారు. ఒక వేళ ఆ కూట‌మిని గెలిపిస్తే పేద‌ల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని చెబుతూ రాజ‌కీయ పొత్తుల మీద చుర‌క‌లు(pakage star) వేశారు.

టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిగా చంద్ర‌బాబు

పొత్తుల మీద ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించిన దోబూచులాటపై గురువారం రాత్రి ప‌వ‌న్ మీడియా ముందుకు రావ‌డంతో స్ప‌ష్టం అయింది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల దృష్ట్యా పొత్తులు ఉంటాయ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అంతేకాదు, సీఎం అభ్య‌ర్థిత్వాన్ని కోర‌నంటూ తేల్చారు. అంటే, టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిగా చంద్ర‌బాబు ఉంటార‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒక్క‌సారిగా ప‌వ‌న్ పై(pakage star) రెచ్చిపోయారు. నెల్లూరు జిల్లా కావ‌లి వేదిక‌గా ప‌వ‌న్ ప్యాకేజీ స్టార్ అంటూ ఆరోప‌ణ‌ల‌కు దిగారు.

ప‌వ‌న్ మాత్రం టీడీపీతో క‌లిసి వెళ్ల‌డానికి నిర్ణ‌యం

`పందుల‌న్నీ క‌లిసి వ‌స్తాయ్, సింహం సింగిల్ ` అంటూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ చెబుతూ వ‌చ్చింది. అందుకే, వ్యూహాత్మ‌కంగా సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్ అంటూ ప్ర‌చారాన్ని రేపింది. నెల‌కో, రెండు నెల‌ల‌కో క్షేత్ర‌స్థాయికి వ‌చ్చే ప‌వ‌న్ స‌భ‌ల‌ను వీలున్నంత వ‌ర‌కు హైలెట్ అయ్యేలా వైసీపీ గ‌త మూడేళ్లుగా చేసింది. కేంద్రంలోని బీజీపీ పెద్ద‌ల ద్వారా ప‌వ‌న్ దూకుడును త‌గ్గించింది. తెలుగుదేశం పార్టీకి దూరంగా ప‌వ‌న్ (pakage star)ఉండేలా పావులు క‌దిపింది. ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేసిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ మాత్రం టీడీపీతో క‌లిసి వెళ్ల‌డానికి నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ నిర్ణ‌యం ఇప్పుడు అధికారంలోకి వైసీపీకి చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

Also Read : Pawan Kalyan: పొత్తులో సీఎం పదవి అడగలేం.. పవన్ కళ్యాణ్ పరోక్ష సంకేతం

ఎవ‌రికి వారే సింగిల్ గా వెళ్లిన‌ప్ప‌టికీ టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తాజా స‌ర్వేల సారాంశం. అయిన‌ప్ప‌టికీ ప్ర‌త్య‌ర్థికి ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా జ‌న‌సేన‌తో క‌లిసి వెళ్ల‌డానికి చంద్ర‌బాబు సిద్ధ‌మ‌య్యారు. ఆ మేర‌కు ఆయ‌న పావులు క‌దుపుతూ వ‌చ్చారు. అలాగే, ప‌వ‌న్ కూడా పార్టీని కాపాడుకోవ‌డానికి వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. ఇరు పార్టీల అవ‌స‌రం, రాష్ట్ర ప్ర‌యోజనం వెర‌సి పొత్తు దాదాపుగా ఖ‌రారు అయింది. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి (Jagan war)అధికారం పోవ‌డం ఖాయంగా స‌ర్వేలు చెబుతోన్న సారాంశం. అందుకే, ఆయ‌న రాజ్యాధికారం కోసం దేవాదాయ‌శాఖ తో ఆరు రోజుల పాటు రాజశ్యామ‌ల‌, చండీ త‌దిత‌ర హోమాలు చేయించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

Also Read : CBN Rally : చంద్ర‌బాబు పాద‌యాత్ర‌, 12న`రైతు పోరుబాట‌`

పొత్తును దాదాపుగా ఖ‌రారు చేసిన ప‌వ‌న్ మీద రాజ‌కీయ దాడి తారాస్థాయికి చేరుతోంది. ఆయ‌న ప్యాకేజీ స్టార్(pakage star) అంటూ ప్ర‌చారం ఉధృతం అవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆఫ‌ర్ చేసిన వెయ్యి కోట్ల నుంచి గ‌తంలో ఆయ‌న రాజ‌కీయ కుప్పిగంతుల‌ను తెర‌మీద‌కు తీసుకొస్తున్నారు. ప‌దేళ్ల‌లో ప‌ది పార్టీల‌తో పొత్తు పెట్టుకున్న ప‌వ‌న్ ఇప్పుడు ప్యాకేజీకి లొంగార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎన్నిక‌ల నాటికి వీలున్నంత వ‌ర‌కు ప‌వ‌న్ రాజ‌కీయ గ్లామ‌ర్ ను క‌డిగేసేందుకు వైసీపీ (Jagan war) సిద్ద‌మ‌యింది. ఆ క్ర‌మంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాయిస్ పెంచారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగబోతున్నారు. జ‌న‌సేన పార్టీని రాజ‌కీయంగా ఆడుకోవాల‌ని వైసీపీ ఇప్ప‌టికే క్యాడ‌ర్ కు దిశానిర్దేశం ఇచ్చింది. ఫ‌లితంంగా తారా స్థాయికి ఏపీ రాజ‌కీయ వాతావ‌ర‌ణ వెళ్ల‌నుంది.