గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దౌర్జన్యంగా భూములు కేటాయించుకున్న సంస్థలు ఇప్పటికీ పద్ధతి మార్చుకోకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి బెదిరింపులకు దిగుతున్నాయి. అందులో ప్రధానంగా ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ (Indsol Company) ప్రభుత్వానికి లేఖ (Threatening letter) రాస్తూ, తమకు కేటాయించిన భూములను మార్చకుండా అందించాలంటూ హెచ్చరికలు చేసింది. ఈ సంస్థ వైసీపీ హయాంలో ఏ ప్రణాళిక లేకుండానే భారీ ఎకరాల భూములను దక్కించుకుంది. ఇప్పుడు ప్రభుత్వం పోర్టు అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ భూములు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా, సంస్థ దాన్ని అంగీకరించకుండా కేంద్రానికి ఫిర్యాదు చేస్తామంటూ బెదిరిస్తోంది.
Vishwambhara : విశ్వంభర లో మరో మెగా హీరో..?
గత ప్రభుత్వంలో ఇండోసోల్‌కు బహిరంగంగా కేటాయింపులు జరిగాయి. 2023లో రామాయపట్నం పోర్టు సమీపంలో సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ తయారీ పేరుతో 8,348 ఎకరాల భూమిని రెండు విడతల్లో అందుకున్నారు. దీనికి సంబంధించి ఏ ప్రాజెక్టు ప్రణాళిక (DPR) సమర్పించకుండానే అడ్డదారిలో ఈ భూములను పొందారు. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఈ అక్రమాలు బహిరంగం అవుతాయనే భయంతో జనవరిలోనే హడావిడిగా షెడ్లు నిర్మించి, నెల రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించినట్లు ప్రకటించింది. పోర్టుకు అడ్డంకిగా ఇండోసోల్ భూములు నిలుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా కారేడు వద్ద భూములను కేటాయించేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇండోసోల్ తమ ప్రాజెక్టును వెనక్కి తీసుకుంటామని, రీలోకేషన్ వల్ల ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని మీడియా, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామంటూ బెదిరింపులకు దిగింది.
Nara Lokesh Warning : తప్పు చేసిన ఏ వైసీపీ నేతను వదిలిపెట్టను – మంత్రి లోకేష్
ప్రభుత్వ వర్గాల ప్రకారం.. ఇండోసోల్‌కు కేటాయించిన భూముల్లో ఒక్క ఎకరాన్ని కూడా తగ్గించలేదు. పైగా ఫోటో వోల్టాయిక్ సెల్స్ తయారీలో ఉపయోగించే ముడి సరుకైన క్వార్ట్జ్ గనులను కూడా ఈ సంస్థకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలు కూడా యధాతథంగా కొనసాగించనుంది. అయినప్పటికీ ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్ బెదిరింపులకు దిగడం, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు పోర్టు అభివృద్ధికి ఆటంకాలు లేకుండా భూవినియోగాన్ని సవరించాల్సిన అవసరం, మరోవైపు గత ప్రభుత్వంలో అక్రమంగా భూసేకరణ చేసుకున్న సంస్థల ఆగడాలను అరికట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇండోసోల్ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.