Dhulipalla Narendra పొన్నూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవికి చింతలపూడిలో ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆమె గుంటూరులోని ధూళిపాళ్ల నరేంద్ర వద్ద ఉంటున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున చింతలపూడిలోని ఆమె నివాసంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన దొంగలు 43 సవర్ల బంగారంతో పాటుగా, పది కేజీల వెండి, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ప్రమీలాదేవి ఫిర్యాదుతో పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే, పొన్నూరు నియోజకవర్గం శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలా దేవి ఇంట్లో భారీ చోరీ జరిగింది. చింతలపూడిలోని ఆమె నివాసంలో దొంగలు పడ్డారు. ప్రమీలాదేవి ప్రస్తుతం గుంటూరులోని ధూళిపాళ్ల నరేంద్ర నివాసంలో ఉంటున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున చింతలపూడిలోని ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడిన దుండగులు.. ఇంట్లోని బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే ఇంటికి వచ్చిన పనిమనుషులు.. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా ఉండటం గమనించారు. దీంతో దొంగతనం జరిగిందేమోననే అనుమానంతో ప్రమీలాదేవికి సమాచారం అందించారు.
దీంతో ప్రమీలాదేవి ప్రొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రమీలాదేవి ఇంట్లోని 43 సవర్ల బంగారంతో పాటుగా 10 కేజీల వెండి, రూ. లక్ష నగదు దోచుకెళ్లినట్లు తెలిసింది. ప్రమీలాదేవి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలిని పరిశీలించింది. పనిమనుషులతో పాటుగా చుట్టుపక్కల వారిని పోలీసులు ఈ విషయంపై విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
