Site icon HashtagU Telugu

Girl Gang Raped: దారుణం.. బట్టలు ఉతికేందుకు వెళ్లిన 15 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారం

Gang Raped

Gang Raped

ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలంలో అమానుషం జరిగింది. ఈనెల 6న చిర్ర యానాం గ్రామంలో బట్టలు ఉతికేందుకు వెళ్లిన 15ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు సాముహిక అత్యాచారానికి (Girl Gang Raped) పాల్పడ్డారు. ఆమెను అక్కడ ఉన్న తోటలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. ఈ క్రమంలో బాలిక అస్వస్థతకు గురి కాగా తల్లిదండ్రులు ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: 4 Killed : చౌటుప్ప‌ల్‌లో రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మ‌హిళ‌లు మృతి

గ్రామపెద్దల సమక్షంలో బాధితులకు రూ. లక్ష ఇచ్చేందుకు నిందితులు ముందుకొచ్చారు. సొమ్మును తీసుకునేందుకు వారు నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ సొమ్మును తీసుకోవడానికి బాలిక తండ్రి నిరాకరించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గురువారం డీఎస్పీ వై.మాధవరెడ్డి సిబ్బందితో వెళ్లి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.