ప్రత్యర్థులు సైతం చంద్రబాబును (CBN P4 Formula) విజనరీగా ఒప్పుకుంటారు. ఆయన తలచుకుంటే ఏదైనా చేయగలరనే నమ్మకం చంద్రబాబు సామర్థ్యం గురించి తెలిసిన వాళ్లు విశ్వసిస్తారు. వచ్చే ఎన్నికల కోసం పూర్ టూ రిచ్ అంటూ ఆయన కొత్త ఫార్ములాను వినిపిస్తున్నారు. ప్రతి ఒక్కర్నీ కోటీశ్వరులను చేస్తానని ప్రామిస్ చేస్తున్నారు. దాన్ని నమ్మొద్దని ప్రత్యర్థులు చెబుతున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం బలంగా పీ 4 ఫార్ములాను చెబుతూ కోటీశ్వరులుగా పేదలను మార్చడం తేలికని విశదీకరిస్తున్నారు. తాజాగా మీడియా చిట్ చాట్ లోనూ అదే వినిపించారు.
చంద్రబాబు మాత్రం బలంగా పీ 4 ఫార్ములా (CBN P4 Formula)
పీ 4 ఫార్ములాను (CBN P4 Formula) మహానాడు వేదికగా చంద్రబాబు వినిపించారు. పూర్, పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్ (పీపీపీపీ) ఫార్ములాను ఏపీ అభివృద్ధి కోసం రూపొందించారు. పీ 4(PPPP) అంటే ఏమిటి..?పూర్ , పబ్లిక్ , ప్రైవేట్ , పార్టనర్ షిప్ (పీపీపీపీ). ఇది పీ3 కి అనుసంధానముగా ఆలోచన చేసారు. ఇప్పటి వరకు అందరికీ తెలిసిన పీ3 అంటే ప్రైవేట్ వ్యక్తులు లేదా వ్యవస్థల నుండి పెట్టుబడులు తెచ్చి ప్రభుత్వ సేవల కోసం పనులు చేస్తారు. దీని వలన ప్రభుత్వానికి కి టైమ్ ప్లస్ వనరులు ఆదావుతాయి. పాదర్శకత, అంకితభావంతో పనులు పూర్తివుతాయి. దానికి ఒక గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వం పని తో పాటు ప్రైవేటు వ్యక్తి / వ్యవస్థకు కూడా లాభం చేకూరుతుంది. దీనికి ఇప్పుడు పూర్ ( పేదలను )ను కూడా భాగస్వామ్యం చేస్తారు.
పూర్, పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్ షిప్ (పీపీపీపీ) ఫార్ములాను ఏపీ అభివృద్ధి కోసం
ఉదాహరణకు ప్రభుత్వానికి కావలసిన పనులు వెబ్ సైట్ లో జాబితా చేసి వాటిని పేదలకు చేరెలా రాయితీలు, బ్యాంకు సహాయం తో ప్రోత్సాహిస్తారు. ఇక్కడ పేదలు అని ఎందుకు మాటిమాటికి ప్రస్తావిస్తున్నారో అర్ధం చేసుకోవాలి. నిజానికి మన అందరికి మన కెరీర్ లో పదోన్నతులు, అదనపు సహాయం, అలవెన్స్ తదితరాలు ఉంటాయి. కానీ రోజువారీ కూలి, అసంఘటిత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమాలు మాత్రమే అందుతుంటాయి. అందుకే పీ4 లో (CBN P4 Formula) చేరటం వలన వారు ఎదగటానికి ఒక అవకాశంతో పాటు ఆదరణ వస్తుంది. జీవన విధానము,సామాజిక గుర్తింపు మెరుగైన పేదరిక నిర్మూలనకు ఒక మార్గం దొరికుతుంది.
విజన్ 2047 కి పీ 4 పునాది(CBN P4 Formula)
విజన్ 2047 కి పీ 4 (CBN P4 Formula) పునాదిగా ఉంటుందని చంద్రబాబు అంటున్నారు. దేశం మొత్తము ఇదే ఫార్ములాను అవలంభించాలి అనేది అయన కోరిక. అప్పుడు పేదలు కూడా కోటీశ్వరులుగా మారతారని భావిస్తున్నారు. ఇదంతా ఎన్నికల స్టంట్ గా ప్రత్యర్థులు కొట్టిపారేస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు మరో పది నెలల గడువే మిగిలి ఉంది. దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలను వైఎస్ జగన్ ఏపీలో అమలు చేస్తున్నారు. ఈ పథకాలే గెలిపిస్తాయని సీఎం జగన్ తో సహా వైసీపీ శ్రేణులంతా భావిస్తున్నారు. రాష్ర్ట అభివృద్ధిని పట్టించుకోని ప్రజలు కేవలం సంక్షేమ పథకాల వైపే మొగ్గు చూపుతారని అంచనా వేస్తున్నారు.
Also Read : CBN Vision 2024 : ఒకేసారి TDP అభ్యర్థుల ప్రకటన?
అధికారంలోకి వస్తే వైసీపీ కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలను అందిస్తామని టీడీపీ చెబుతోంది. రాజమండ్రిలో మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన పథకాలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నది. పూర్ టు రిచ్ అనే సరికొత్త ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నారు. దానిపై ఇప్పుడు చర్చ సాగుతున్నది. పూర్ టూ రిచ్ కార్యక్రమం కూడా వంచనకేనని వైసీపీ శ్రేణులు ప్రతిదాడికి దిగాయి, పూర్, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పీ4 ట్యాగ్ లైన్ తో దీనిని అమలు చేస్తామని టీడీపీ చెబుతున్నది. పూర్ టూ రిచ్ అనేది కొత్త విధానం. దాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టమే. కానీ, చంద్రబాబు రచించిన ఈ స్కీమ్ (CBN P4 Formula) ఆర్థిక విప్లవాన్ని తెస్తుందని ఆర్థిక వేత్తల్లోని లెక్క.
Also Read : NDA Meeting TDP: ఎన్డీయేలోకి టీడీపీ? జులై 18న ఢిల్లీలో ఎన్డీయే విస్తృత స్థాయి సమావేశం.. టీడీపీకి ఆహ్వానం!
ఆరు వజ్రాలతో పాటు పలు వేదికలపై పూర్ టూ రిచ్ ప్రోగ్రామ్ ను విడమరచి చెప్పాలని క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. రాబోవు ఎన్నికల్లో ఈ నినాదం బాగా పనిచేస్తుందని నమ్ముతున్నారు. పూర్ టూ రిచ్ ఎలా సాధ్యమో విడమరచి చెబుతున్నారు. దాన్ని వింటోన్న టీడీపీ క్యాడర్ ప్రజల మధ్యకు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితం కూడా ఆశించిన విధంగా ఉంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఏపీలో ఈసారి టీడీపీ వస్తే, పేదలందరూ కోటీశ్వరులను (CBN P4 Formula) చేయడం తన బాధ్యతంటూ చంద్రబాబు చెప్పడం గమనార్హం.